జాతీయ వార్తలు

రిహార్సల్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూలై 18: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగిస్తున్న చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లను శాస్తవ్రేత్తలు మళ్లీ సిద్ధం చేశారు. ఈ నెల 22న మధ్యాహ్నం 2:43గంటలకు చంద్రయాన్-2ను పునఃప్రయోగించనున్నారు. ప్రయోగానికి సంబంధించిన రిహార్సల్‌ను గురువారం షార్‌లో శాస్తవ్రేత్తలు విజయవంతంగా నిర్వహించారు. జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3-ఎం 1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 మిషన్‌లో అర్భిటర్, ల్యాండర్, రోవర్‌ను చంద్రుని మీదకు పంపనున్నారు. ఈ నెల 15న ప్రయోగించాల్సిన చంద్రయాన్-2 ప్రయోగం కౌంట్‌డౌన్ జరిగే సమయంలో రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో వాయిదా వేశారు. లోపాన్ని కేవలం 48గంటల్లోనే శాస్తవ్రేత్తలు సరిచేసి రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేశారు. ఇస్రో డాక్టర్ కె శివన్ కూడా షార్‌లోను ఉండి ప్రయోగ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. భాతర అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 22న ఇస్రో మళ్లి జాబిలి యాత్రకు సన్నద్ధమవ్వడంతో మళ్లీ షార్‌లో సందడి వాతావరణం నెలకొంది. ప్రయోగానికి సంబంధించిన కౌంటౌడౌన్ ఈ నెల 21న సాయంత్రం 6:43గంటలకు ప్రారంభిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగినంతరం సోమవారం మధ్యాహ్నం 2:53గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-మార్క్3 రాకెట్ చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. ఇస్రో కూడా చంద్రయాన్-2 ప్రయోగాన్ని అధికారికంగా ప్రకటించింది. భూమి నుంచి రాకెట్ నింగికెగసినంతరం కేవలం 16నిమిషాల్లో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేవపెట్టనుంది. అక్కడ నుంచి చంద్రయాన్-2 మిషన్‌లో అమర్చిన అర్బిటర్, ల్యాండర్, రోవర్ 52రోజుల పాటు పయనించినంతరం అర్బిటర్ ప్రొపలైజేషన్ విధానంలో ఈ మూడు పరికరాలు చంద్రుని కక్ష్యలోకి చేరుతాయి. అక్కడ అర్భిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుని వైపు దూసుకుపోతోంది. ఈ ప్రయోగంలో అర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయేదే కీలక ఘట్టం. వడిపోయిన అనంతనరం అర్భిటర్ నిర్ధేశిత కక్ష్యలోనే తిరుగుతుంది. మరో పక్క ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువం పై నిర్ధేశిత ప్రాంతంలో దిగుతుంది. ల్యాండర్ క్షేమంగా లక్ష్యాన్ని చేరుకొన్నాక దానిలో నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుడి పై పరిశోధనలు చేస్తుంది. ఈ రోవర్ ప్రయోగాలు చేయడానికి అవసరమైన పరికరాలను కూడా ల్యాండర్‌లో పై భాగంలో అమర్చారు. రోవర్ సాయంతో చంద్రుడి ఉపరితలం, ఖనిజాలు వంటి వాటిని అనే్వషిస్తారు. అంతా అనుకొన్నట్లు జరిగే సెప్టెంబర్ 14నుంచి ఇస్రోకు సంకేతాలను పంపుతుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఈ నెల 15న వాయిదా పడిన చంద్రయాన్-2 ప్రయోగ వేదిక పై నుంచి రాకెట్‌ను తియ్యకుండానే శాస్తవ్రేత్తలు రేయింబవళ్లు శ్రమించి సాంకేతిక లోపాన్ని సరిచేసి మళ్లీ వారం రోజుల్లోనే జాలిబి యాత్రకు రాకెట్‌ను రెడీ చేయడం విశేషం. గురువారం కూడా రాకెట్‌లోని అన్ని వ్యవస్థల పనితీరును పరిశీలించి ప్రయోగ రిహార్సల్‌ను కూడా విజయవంతంగా నిర్వహించారు. రిహార్సల్‌లో భాగంగా రాకెట్‌ను ప్రయోగ వేదికలో మోబైల్ సర్వీసు టవర్ నుంచి రాకెట్ నిధానంగా బయటకు తీసుకొచ్చి మళ్లి వెనక్కి తీసుకెళ్లె ప్రక్రియను శాస్తవ్రేత్తలు విజయవంతంగా నిర్వహించారు. శుక్రవారం ప్రీ కౌంటౌడౌన్ నిర్వహించి గ్లోబల్ పరీక్షలనంతరం కౌంట్‌డౌన్‌ను సిద్ధం చేస్తారు.