జాతీయ వార్తలు

చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే మరణ శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: చిన్నారులపై లైంగిక వేదింపులకు పాల్పడేవారికి మరణ శిక్ష విధించేందుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అశ్లీల ప్రవర్తనకు ఏడేళ్ల జైలుశిక్షతోబాటు జరిమానా విధించేందుకు సైతం ఈ చట్టం వీలుకల్పిస్తుంది. ఈ తరహా నేరాలను అరికట్టే ఉద్దేశంతో శిక్షల తీవ్రతను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. పోక్సో చట్టంలో సవరణలతో కూడిన ఈ బిల్లును గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రస్తుతం ఉన్న 2012 పోక్సో చట్టాన్ని సవరిస్తూ కొత్తగా రూపొందిన ‘చిన్నారులపై లైంగిక వేదింపుల నివారణ చట్టం 2019 బిల్లును కేంద్ర మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులపై నానాటికీ పెరిగిపోతున్న లైంగిక వేదింపులను అరికట్టాల్సిన తక్షణావసరం ఉందని అన్నారు. ఈ కొత్త బిల్లు ద్వారా వస్తున్న సవరించిన చట్టం అనేక లైంగిక నేరాలకు విధించే శిక్షల తీవ్రతను పెంచుతుందన్నారు. పూర్తి భద్రత, రక్షణతో కూడిన గౌరవప్రదమైన బాల్యాన్ని గడిపేందుకు పిల్లలకు పూర్తిస్థాయిలో అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ బిల్లు ద్వారా అసభ్యతతో కూడిన ఎలాంటి వస్తువులు, లేదా పరికరాలనైనాన తొలగించడం లేదా నాశనం చేసే అధికారాలు ప్రభుత్వానికి సంక్రమిస్తాయన్నారు. అలాగే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులపైన అయినా కఠిన చర్యలు తీసుకునే వీలుంటుందన్నారు. 16 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే కామాంధులకు 20 ఏళ్ల జైలుశిక్ష, లేదా జీవితకాల జైలు శిక్ష, జరిమానా, లేదా నేర తీవ్రతనుబట్టి మరణ శిక్ష విధించే అవకాశం ఉంటుందని స్మృతి ఇరానీ వివరించారు. అలాగే చిన్నారును అశ్లీల కార్యకలాపాలకు వినియోగించుకునే వారిని సైతం శిక్షించాల్సిన అవసరం ఉందని, అలాంటి వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడేలా ఈ బిల్లు ద్వారా వస్తున్న సవరించిన చట్టం వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. అలాగే ఈ శిక్షను ఏడేళ్ల వరకు పొడిగించి జరిమానాలను విధించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
చిన్నారుపై లైంగిక వేదింపులకు పాల్పడేవారిలో అమానవీయ ఆలోచనా విధానం ఉన్నట్టు తేలిందని వారు నిరంతరం నేర ప్రవృత్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారని, చిన్ననాటి పరిసరాలు, పరిస్థితులు, సమాజం పట్ల అవగాహనా రాహిత్యం వంటి వాటివల్ల ఈ తరహా నేరప్రవృత్తి పెరుగుతోందని ఆమె అన్నారు.