జాతీయ వార్తలు

జాదవ్‌ను వదిలేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: పాకిస్తాన్ తన వద్ద ఉన్న మాజీ నావికాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను వెంటనే విడుదల చేయాలని భారత్ గురువారం డిమాండ్ చేసింది. కుల్‌భూషణ్ జాదవ్‌ను వెనక్కి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తానని పేర్కొంది. కుల్‌భూషణ్ జాదవ్‌కు విధించిన మరణ శిక్షను సమీక్షించాల్సిందిగా అంతర్జాతీయ న్యాయస్థానం పాకిస్తాన్‌ను ఆదేశించిన మరుసటి రోజు భారత్ ఈ డిమాండ్ చేసింది.
కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) ఇచ్చిన తీర్పుపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ గురువారం పార్లమెంటు ఉభయ సభలలో ఒక ప్రకటన చేశారు. ‘కుల్‌భూషణ్ జాదవ్‌తో మాట్లాడటానికి, అతడిని కలుసుకోవడానికి, నిర్బంధంలో ఉన్న సమయంలో అతడిని చూడటానికి, అతనికి న్యాయ సహాయాన్ని ఏర్పాటు చేయడానికి భారత్‌కు ఉన్న హక్కును పాకిస్తాన్ అడ్డుకున్న విషయం వెల్లడయింది’ అని జైశంకర్ పేర్కొన్నారు. ‘కుల్‌భూషణ్ జాదవ్ అమాయకుడు. అతడిపై చేసిన అభియోగాలు నిజం కాదు. అతడికి న్యాయ సహాయం అందకుండా చేసి, దర్యాప్తు, విచారణ ప్రక్రియను సజావుగా జరుపకుండా అతడితో బలవంతంగా నేరాన్ని అంగీకరింపచేసినంత మాత్రాన ఈ వాస్తవం మారిపోదు’ అని మంత్రి అన్నారు. పాకిస్తాన్ గూఢచర్యం, విద్రోహం అభియోగాలపై కుల్‌భూషణ్ జాదవ్‌కు 2017లో విధించిన మరణశిక్షను నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం బుధవారం ఆదేశించింది. ‘కుల్‌భూషణ్ జాదవ్ క్షేమంగా ఉండటంతో పాటు వీలయినంత త్వరగా భారత్‌కు తిరిగి రావడం కోసం ప్రభుత్వం తన కృషిని తీవ్రంగా కొనసాగిస్తుంది’ అని జైశంకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా సభ్యులు బల్లలు చరుస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును స్వాగతించారు. ‘కుల్‌భూషణ్ జాదవ్‌ను తక్షణమే విడుదల చేసి, స్వదేశానికి పంపించవలసిందిగా మేము మరోసారి పాకిస్తాన్‌కు పిలుపునిస్తున్నాం’ అని మంత్రి పేర్కొన్నారు. పాక్ ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తాం
లండన్/ ద హేగ్: కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ఐసీజే ఆదేశాల అమలు విషయంలో పాకిస్తాన్ ప్రవర్తనను నిశితంగా పరిశీలించడం జరుగుతుందని భారత్ హెచ్చరించింది. పాకిస్తాన్ ఈ కేసులో ఏదయినా ప్రహసనానికి పాల్పడితే భారత్ తిరిగి ఐసీజేను లేదా ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిని ఆశ్రయించడం జరుగుతుందని స్పష్టం చేసింది. ‘జాదవ్‌కు న్యాయం జరిగేందుకు, అతడికి నిష్పక్షపాత విచారణ దక్కేందుకు తోడ్పడటానికి ఇది మాకు మంచి సమయం’ అని ఈ కేసులో భారత్ తరపున వాదిస్తున్న ప్రధాన న్యాయవాది హరీశ్ సాల్వే ఐసీజే తీర్పు వెలువడిన అనంతరం బుధవారం లండన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.
చిత్రం...అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై గురువారం ప్రకటన చేస్తున్న విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్