జాతీయ వార్తలు

63 శాతం మందికి 50 శాతం ఓట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీల గెలుపు, ఓట్ల శాతంపై అసోసియేటెడ్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ పత్రాన్ని విడుదల చేసింది. 2019 ఏప్రిల్, మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 542 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం, గెలిచిన అభ్యర్థుల ఓట్ల శాతంపై సంపూర్ణంగా విశే్లషించినట్లు ఆ సంస్థ తెలిపింది. 341 మంది ఎంపీలు అంటే 63 శాతం మంది తమ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు తెచ్చుకుని గెలిచారు. 201 మంది ఎంపీలు అంటే 37 శాతం మంది తమ నియోజకవర్గాల్లో 50 శాతం కంటే తక్కువ ఓట్లతో నెగ్గారు. బీజేపీ నుంచి నెగ్గిన 303 మంది ఎంపీల్లో 79 మందికి మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం కంటే తక్కువపడ్డాయి. 52 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 34 మంది 50 శాతం కంటే తక్కువ ఓట్లతో, డీఎంకే నుంచి నలుగురు ఎంపీలు, తృణమూల్ నుంచి 22 మంది, వైకాపా నుంచి 9 మంది 50 శాతం కంటే తక్కువ ఓట్లుపోలయ్యాయి. 133 మంది ఎంపీలు తమ నేర చరిత్రను ప్రకటించారు. వీరికి మొత్తం ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 313 మంది కోటీశ్వరులైన ఎంపీలకు కూడా 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఏడుగురు ఎంపీలు రెండు వేల కంటే తక్కువ ఓట్లతో నెగ్గారు. ఎటువంటి నేరచరిత్రలేని అభ్యర్థులపై 115 మంది నేరచరిత్ర ఉన్న ఎంపీలు గెలవడం విశేషం. ఇందులో ఆరుగురికి 40 శాతం కంటే ఎక్కువ ఓట్లుపోలలయ్యాయి. మొత్తం పైన 115 మంది ఎంపీలకు ఎటువంటి నేరచరిత్ర లేకపోయినా, ప్రజల ఆదరణతో నేరచరిత్ర ఉన్నవారిపై గెలిచారు. ఇందులో ఏడుగురు 40 శాతం కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుని నెగ్గారు. మొత్తం 474 మంది కోటీశ్వరులైన ఎంపీలు గెలిచారు. వీరిలో 54 మంది కోటీశ్వరులు కానివారిపై గెలిచారు. ఇందులో ఐదుగురు 30 శాతం కంటే ఎక్కువ మార్జిన్‌తో నెగ్గారు. కోటీశ్వరులు కాని 48 మంది ఎంపీలు కోటీశ్వరులపై గెలిచారు. ఇందులో 21 మంది 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు.
మొత్తం 542 మంది ఎంపీల్లో 78 మంది మహిళలు ఉన్నారు. గుజరాత్‌కు చెందిన సూరత్ నియోజకవర్గంకు చెందిన బీజేపీమహిళా ఎంపీ దర్శన విక్రమ్ జర్దోష్ ఎక్కువ ఓట్ల తేడాతో నెగ్గారు. ఆమెకు మొత్తం ఓట్లలో 74.47 శాతం ఓట్లు వచ్చాయి. మళ్లీ ఎన్నికైన ఎంపీలు 225 మంది ఉన్నారు. వీరిలో 160 మంది 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. మళ్లీ ఎన్నికైన 28 మంది ఎంపీలు ఐదు శాతం కంటే తక్కువ తేడాతో నెగ్గారు. 15 మంది 40 శాతం కంటే ఎక్కువ తేడాతో గెలిచారు. మొత్తం ఓట్లు 61,31,300 ఓట్లు పోలైతే, 65,14,558 ఓట్లు నోటాకు వెళ్లాయి. మొత్తం పోలైన ఓట్లలో 1.06 శాతం ఓట్లు నోటాకు పోలయ్యాయి.