జాతీయ వార్తలు

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించడంతోపాటు, వివిధ రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. మ ధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న ఆనందీబెన్ పటేల్‌ను ఉత్తరప్రదేశ్‌కు, బిహార్ గవర్నర్‌గా పనిచేస్తున్న లాల్జీ టాండన్‌ను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేసింది. బిహార్ గవర్నర్‌గా ఫగు చౌహన్‌ను, పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా జగ్‌దీప్ ధన్‌ఖర్‌ను, త్రిపుర గవర్నర్‌గా రమేశ్ బయాస్‌ను, నాగాలాండ్ గవర్నర్‌గా ఆర్‌ఎస్ రవిని నియమించింది. ఈ మేరకు రాష్టప్రతి భవన్ శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను నియమించడంతోపాటు కొందిమందిని బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తోసహా వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడం తెలిసిందే. తెలంగాణకు కూడా కొత్త గవర్నర్ నియామకం ఖాయమని ఢిల్లీలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా, విభజన తరువాత గత ఐదేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగిన నరసింహన్‌ను ఏపీ నుంచి తప్పించి తెలంగాణకు మాత్రమే పరిమితం చేశారు. నరసింహన్‌ను కేంద్ర స్థాయిలో ఒక విభాగానికి సలహాదారుడిగా నియామించనున్నట్టు ప్రచారం సాగుతుంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో నియామకం జరిగి ఇప్పటికీ కొనసాగుతున్న ఒకే ఒకక గవర్నర్‌గా నరసింహన్ రికార్డు సృష్టించారు. యూపీఏ నియమించిన గవర్నర్లను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత అందరినీ తప్పించింది. ప్రధానంగా సంఘ్ నాయకులను ఏరికోరి మరీ గవర్నర్లుగా కేంద్ర ప్రభుత్వం నియమిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాలు ఉన్నచోటట కీలక వ్యక్తులను గవర్నర్లుగా మోదీ ప్రభుత్వం నియమిస్తోంది.
చిత్రాలు.. ఆనందీ బెన్ పటేల్ *లాల్జీ టాండన్