జాతీయ వార్తలు

స్వాతి హత్య కేసు నిందితుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 18: కొన్ని నెలల క్రితం స్వాతి అనే 24 ఏళ్ల ఐటి ఉద్యోగినిని దారుణంగా హతమార్చిన నిందితుడు టి. రామ్‌కుమార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో రామ్‌కుమార్ పుంజై సెంట్రల్ జైలులో ఒక కరెంటు వైరును నోటితో గట్టిగా పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆలోగానే మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే రామ్‌కుమార్ ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నాడనేదానిపై స్పష్టత లేదు. ఈ ఘటన జరిగిన గంట తర్వాత గానీ అధికారులు అతనిని ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు అనేది కూడా ప్రశ్నార్ధకంగా మారింది. దీనిపై జైలు అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. రామ్‌కుమార్ భౌతికకాయానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహిస్తారు. జూన్ నెలలో చెన్నైలోని నంగుంబాకం రైల్వే స్టేషన్ వద్ద స్వాతి అనే ఐటి ఉద్యోగినిని రామ్‌కుమార్ అత్యంత హేయంగా హతమార్చాడు. గతంలో కూడా అతడు ఆత్మహత్యా యత్నం జరిపినట్లు తెలుస్తోంది. జూలై 3న పోలీసులు తనను అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు రామ్‌కుమార్ మెడను కోసుకున్నాడు. కొద్ది రోజులు చికిత్స కూడా తీసుకున్నాడు.