జాతీయ వార్తలు

చందమామ చెంతకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూలై 20: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో బృహత్తర ప్రయోగానికి సన్నద్ధమైంది. ఈ నెల 15న ప్రయోగించాల్సిన చంద్రయాన్-2ను రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో వాయిదా వేశారు. సాంకేతిక లోపాన్ని సరిచేసి ఈ నెల 22న చంద్రయాన్-2ను ప్రయోగించేందుకు శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. అంతరిక్ష రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న ఇస్రో చంద్రయాన్-2 ద్వారా మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3-ఎం1 రాకెట్ ద్వారా జాబిలమ్మ యాత్రకు చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని పంపుతోంది. అగ్రదేశాలు చేయని పనిని మన శాస్తవ్రేత్తలు ఎన్నో అవరోధాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక పరీక్షలు నిర్వహించిన అనంతరం చంద్రుని మీదకు పరిశోధనకు ఆర్బిటర్, విక్రమ్ అనే ల్యాండర్, ప్రగ్యాన్ అనే రోవర్‌ను పంపుతున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 2:43 గంటలకు చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టనున్నారు. ఈ ప్రయోగం దృష్ట్యా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ ఆదివారం షార్‌కు చేరుకోన్నారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) ఇస్రో చైర్మన్ బెంగళూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. షార్‌లోని కల్పన అంతరిక్ష భవనంలో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో శాస్తవ్రేత్తలు, ఇస్రోలోని అన్ని సెంటర్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. చైర్మన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ప్రయోగానికి సంబంధించిన విషయాలపై శాస్తవ్రేత్తలతో సుదీర్ఘంగా చర్చించారు. ఎంఆర్‌ఆర్ అనంతరం జరగాల్సిన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) వారు మాత్రం సమావేశం కాలేదు. ఆదివారం ఇస్రో చైర్మన్ షార్‌కు రానున్న నేపధ్యంలో ల్యాబ్ సమావేశం అదేరోజు నిర్వహించనున్నట్లు తెలిసింది. ల్యాబ్ వారు సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలపనున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఆదివారం సాయంత్రం 6:43 గంటలకు ప్రారంభించనున్నారు. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో రాకెట్‌లోని మూడో దశలో ధ్రవ ఇంధనాన్ని నింపనున్నారు. ఇంధనం విజయవంతంగా నింపిన అంతరం రాకెట్‌లోని అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి ప్రయోగానికి సిద్ధం చేస్తారు. అన్ని వ్యవస్థల పనితీరును బాగా పనిచేస్తున్నాయని నిర్ధారణ అయిన తర్వాత ప్రయోగానికి 8 గంటల ముందు రాకెట్‌కు విద్యుత్ సరఫరా ఇచ్చి మిషన్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్న సూపర్ కంప్యూటర్లకు అనుసంధానం చేసి అక్కడ నుంచి ప్రయోగాన్ని పరిశీలిస్తారు. కౌంట్‌డౌన్ 20 గంటలు నిర్విఘ్నంగా కొనసాగినంతరం షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3-ఎం 1 ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 2:43 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని తీసుకెళ్లనుంది.
చిత్రం...ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3 రాకెట్