జాతీయ వార్తలు

యుపిఎస్‌సి చైర్‌పర్సన్‌గా అల్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి)చైర్మన్‌గా మాజీ ఐఎఎస్ అధికారి అల్కా సిరోహి నియమితమయ్యారు. మంగళవారం పదవీ విరమణ చేస్తున్న దీపక్ గుప్తా స్థానే సిరోహీ నియమితమయ్యారు. 21న ఆమె పదవీ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం యుపిఎస్‌సి కమిషన్ సభ్యురాలిగా సిరోహీ కొనసాగుతున్నారు. ఈ తాజా నియామకం వచ్చే ఏడాది జనవరి మూడో తేదీ వరకూ లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకూ కొనసాగుతుంది. సాధారణంగా కమిషన్ సభ్యులనే చైర్మన్‌గా నియమిస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ సంప్రదాయానికి భిన్నంగా 2014 నవంబర్‌లో యుపిఎస్‌సితో సంబంధం లేని గుప్తాకు చైర్మన్ బాధ్యతలు అప్పగించింది. కమిషన్‌లో అత్యంత సీనియర్ సభ్యురాలైన సిరోహీకే ఆ పదవి దక్కాల్సి ఉంది. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన సిరోహీ 2012లో యుపిఎస్‌సి సభ్యురాలిగా చేరారు. అంతకుముందు సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ విభాగం కార్యదర్శిగా పనిచేశారు.