బిజినెస్

బలంగా తొలి అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం రెండోసారి కేంద్రంలో పగ్గాలు చేపట్టిన తొలి 50 రోజుల్లోనే రానున్న ఐదేళ్ల కాలంలో దేశాన్ని ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో వృద్ధిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ విధివిధానాల గురించి బాగా తెలిసిన ఇద్దరు వ్యక్తులు ఆర్థికాభివృద్ధితోపాటు వివిధ అంశాల్లో అభివృద్ధిపరంగా తీసుకునే చర్యలతోనే ఈ మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ లోక్‌సభలో అత్యధికంగా 303 సీట్లను సాధించి మే 30న బాధ్యతలు చేపట్టింది. 1971 నుంచి ఇప్పటివరకు ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి కేంద్రంలో అధికార పగ్గాలను చేపట్టిన దాఖలాలు లేవు. ఈ ఘనతను బీజేపీ సొంతం చేసుకుంది. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఇపుడు ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రైతులు, చిన్నతరహా వ్యాపారులు, అసంఘటిత రంగంలోని కార్మికులకు పెన్షన్ పథకంతోపాటు రైతులకు ఇంతవరకు అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని మళ్లీ పొడిగించడం, జల్ శక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం వంటి పథకాలతో ముందుకు సాగుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు వీలుగా ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో తగిన కేటాయింపులు జరిపింది.
ముఖ్యంగా రానున్న ఐదేళ్ల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లుగా తీర్చిదిద్దే క్రమంతోపాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని యోచిస్తోందని ప్రభుత్వ విధివిధానాల గురించి బాగా తెలిసిన ఆ ఇద్దరు వ్యక్తులు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని, తద్వారా ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన ఆరవ దేశంగా ఆవిర్భవించనుందని తెలిపారు. అదేవిధంగా నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడం ద్వారా వచ్చే ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దుతామని ఆమె స్పష్టం చేశారు.