జాతీయ వార్తలు

ఉగ్రవాదులకు తలవంచం: ప్రణబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: యూరి సెక్టార్‌లోని సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రవాద దాడిని అత్యంత గర్హనీయ, విఘాతక చర్యగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఖండించారు. ఉగ్రవాదులు, వారిని ప్రోత్సహించేవారిని కుత్సిత లక్ష్యాలను వమ్ము చేస్తామని, ఇలాంటి చర్యలకు భారత్ తలవంచేది లేదని, గట్టిగా తిప్పికొడతామని పాకిస్తాన్ పేరును ప్రస్తావించకుండా రాష్టప్రతి హెచ్చరించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికులకు ఘన నివాళులర్పించిన రాష్టప్రతి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. దాడిలో గాయపడ్డ ఇతర సైనికులు త్వరితగతిన కోలుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.