జాతీయ వార్తలు

పట్నాయక్ తప్పుకో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, జూలై 22: అత్యాచారాలు, చిన్న పిల్లల అదృశ్యాలపై ఒడిశా అసెంబ్లీని కుదిపేసింది. దీనికి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా బిజూ జనతాదళ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. అంతేకాకుండా విపక్షాల సభ్యులు స్పీకర్ పోడియంపై బైఠాయించి సీఎం నవీన్ పట్నాయక్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేయడంతో పాలక ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుని గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో స్పీకర్ పలు పర్యాయాలు సభను వాయిదా వేశారు. అంతకుముందు బీజేపీ నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రదీపత్త కుమార్ నాయక్ మాట్లాడుతూ బీజేడీ అధికారాన్ని చేపట్టిన తర్వాతే రాష్ట్రంలో చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళడం, మహిళలపై అత్యాచారాలు పెరిగాయని ఆరోపించారు. నాలుగేళ్ళలోనే ఆరు వేల మంది పిల్లలు అపహరణకు గురయ్యారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో 40 శాతం మంది పిల్లల ఆచూకి లనించలేదన్నారు. 2919 మార్చిలో 502 మంది బాలికలు, 100 మంది బాలురు అదృశ్యమయ్యారని ఆయన తెలిపారు. వీరిలో 31 మంది బాలురను, 79 మంది బాలికలను మాత్రమే పోలీసులు గుర్తించారని ఆయన చెప్పారు. అంగుల్‌లో ఎనిమిదేళ్ళ బాలికపై అత్యాచారం జరిగిందని ఆయన విమర్శించారు. అనంతరం కాంగ్రెస్ శాసనసభాపక్షం నాయకుడు నరసింగ మిశ్రా ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఎన్ని అఘాయిత్యాలు జరిగినా, శాంతి-్భద్రతలు సజావుగా ఉన్నాయని సీఎం అంటున్నారని విమర్శించారు. అత్యాచార ఘటనలు ప్రతి ఏడాది పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దశలో బీజేడీ సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుపడడంతో, పాలక-ప్రతిపక్షాల మధ్య వాగ్వావాదం జరిగింది. బీజేపీ-కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియంపైకి వెళ్ళి బైఠాయించారు. పిల్లల అదృశ్యంపై ప్రభు త్వం ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉందని స్పీకర్ ఎస్‌ఎన్ పాత్రో చెప్పినా విపక్షాల సభ్యులు వినిపించుకోకుండా నినాదాలు చేయసాగారు. దీంతో స్పీకర్ పాత్రో సభను మరోసారి వాయిదా వేశారు.