జాతీయ వార్తలు

ఎంతో చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలి 50 రోజుల్లో సాధించిన ప్రగతిపై ‘రిపోర్టు కార్డు’ను సోమవారంనాడు విడుదల చేసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయాన్ని అందుకుని కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చింది. తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తాజా ఎన్నికల్లో మరోసారి గెలుపు ద్వారా అభివృద్ధి, సంస్కరణల పరంగా తీసుకుంటున్న చర్యలను బీజేపీ ఆ రిపోర్టు కార్డులో సోదాహరణంగా పేర్కొంది. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తమ ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన ప్రగతిపై సోమవారంనాడు ఒక రిపోర్టును విడుదల చేశారు. గడచిన 50 రోజుల్లో ‘వేగం, నైపుణ్యం, స్థాయి’పరంగా సాధించిన పురోగతిని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. సమాజంలోని భిన్నవర్గాల సంక్షేమాన్ని కాంక్షించి చేపడుతున్న అనేకానేక పథకాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యంగా రైతులు, వ్యాపారులు, చిన్నతరహా వర్తకులు, సైనికులు, నిరుద్యోగ యువతతోపాటు మధ్యతరగతి ప్రజల మేలు కోసం ప్రకటించిన పలు పథకాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ పేర్కొన్నారు. సంస్కరణలను వేగవంతం చేయడంతోపాటు సంక్షేమం, అందరికీ న్యాయం చేసే దిశగా తొలి ఐదేళ్ల పాలన కంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మెరుగుపడిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 303 సీట్లను గెల్చుకుని మే 30న కేంద్రంలో రెండోసారి అధికార పగ్గాలను చేపట్టిన తర్వాత ఎన్నో విప్లవాత్మక చర్యల దిశగా దూసుకుపోతోందని ఆయన వివరించారు. ముఖ్యంగా తమ ప్రభుత్వం రానున్న ఐదేళ్ల కాలంలో 5 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ఆలోచన కల కాలదని, ఆ దిశగా ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో కేంద్ర మంత్రి జవడేకర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం తొలి ఐదేళ్ల పాలన కంటే ఇపుడు మరింత సమర్ధంగా పనిచేస్తూ వృద్ధి రేటును మరింత ఎక్కువగా నమోదు చేస్తోందని, అదేవిధంగా అంతర్జాతీయ వేదికల్లో మోదీ హాజరు, ప్రపంచ రాజకీయాల్లో భారత్ ప్రభావాన్ని స్పష్టం చేస్తోందని అన్నారు. దేశం త్వరితగతిన అభివృద్ధి చెందేందుకు వీలుగా తాము చేపడుతున్న సంస్కరణల వేగవంతానికి వీలుగా వౌలిక సౌకర్యాలు, సామాజిక న్యాయం, విద్య తదితర అంశాల అమలుకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని ఆయన అన్నారు. రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, ఇతర వౌలిక రంగాలు, జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు ద్వారా 2024కల్లా దేశంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటి అందించడం వంటి వాటి కోసం కేంద్ర ప్రభుత్వం 100 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం వంటివాటితో ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే సమాజంలోని అన్నివర్గాల ప్రజల అభివృద్ధితోపాటు ప్రతిఒక్కరి విశ్వాసాన్ని చూరగొంటామని ఇచ్చిన హామీ మేరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికే 50 రోజుల పాలనలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు అమలు చేస్తోందని, ఇదే తరహాలో రానున్న రోజుల్లో కూడా దూసుకుపోతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.