జాతీయ వార్తలు

ఆసేతు హిమాచలం ‘చంద్రహాసం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: చందమామను అందుకునే రెండో ప్రయత్నం విజయవంతమైన మధుర క్షణాల్లో యావత్ భారతం ఉప్పొంగిపోయింది. చంద్రుడిని అనేక కోణాల్లో శోధించడానికి ఎన్నో కొత్త విషయాలను కరతలామలకం చేయడానికి జరిగిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావడం పట్ల కోటానుకోట్ల మంది భారతీయులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ సహా యావత్ నాయకత్వం ఈ ప్రయోగం విజయం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఈ నిరుపమాన విజయాన్ని సాధించిన ఇస్రో శాస్తవ్రేత్తలు, ఇంజనీర్లను అభినందించారు. ఇదొక చారిత్రక ప్రయాణమని, యావత్ భారతానికి గర్వకారణమని నేతలు శ్లాఘించారు. చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా ఎన్నో కొత్త ఆవిష్కరణలు వెలుగుచూస్తాయని, అలాగే భారత విజ్ఞాన వ్యవస్థ మరింత సుసంపన్నం అవుతుందని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. ‘యావత్ భారతం ఎంతో ఆనందంతో తలమునలకలవుతోంది. ఇది ఎంతో గర్వకారణమైన క్షణం’ అని ప్రధాని మోదీ అన్నారు. చంద్రయాన్-2లో పూర్తిగా స్వదేశీ సాంకేతిక వ్యవస్థలనే ఉపయోగించడాన్ని ప్రస్తావించిన ఆయన ‘ఇది భారతీయ హృదయం, భారతీయ స్ఫూర్తి’ అని వ్యాఖ్యానించారు. చంద్రయాన్-2 వంటి ప్రయోగాలు రోదసీ పరిశోధన పట్ల యువతకు మరింత స్ఫూర్తినిస్తాయని, శాస్త్ర విజ్ఞాన అవగాహనను పెంచుతాయని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్-2 ప్రయోగాన్ని తాను వీక్షిస్తున్న ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్తవ్రేత్తలను బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. అంతరిక్ష శాస్త్ర పరిశోధనల్లో మన శాస్తవ్రేత్తలు మరో ముందడుగు వేయడం ద్వారా భారతదేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేశారని ఆయన అభివర్ణించారు. ‘మన సంస్థలు ప్రతిసారీ సరికొత్త ఆవిష్కరణలు చేసే దిశగా ప్రోత్సహిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు’ అని అమిత్ షా ఒక ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. ఇస్రో సోమవారంనాడు చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇందులో పాలుపంచుకున్న టీమ్‌నంతటినీ కాంగ్రెస్ అభినందించింది. అంతరిక్ష ప్రయోగాల్లో భారత సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకువెళ్లే ఘనత సాధించడం గర్వకారణమని, ఇందుకు తమ వంతు పాత్ర పోషించిన ప్రధాన మంత్రులను గుర్తు చేసింది.
‘ఈ శుభతరుణంలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 1962 వరకు ఇన్‌కస్పార్‌గా వ్యవహరించే అంతరిక్ష పరిశోధనలకు నిధులు మంజూరు చేయగా, ఆ తర్తా అది ఇస్రోగా రూపాంతరం చెందింది. అదేవిధంగా డాక్టర్ మన్మోహన్‌సింగ్ 2008లో చంద్రయాన్-2 ప్రాజెక్టుకు మంజూరీ ఇచ్చారు’ అని కాంగ్రెస్ తన అధికార ట్విట్టర్‌లో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా సైతం చంద్రయాన్-2 విజయవంతంగా ప్రయోగించినందుకు అభినందనలు చెబుతూ ఇలాంటివి మరెన్నో ప్రయోగించాలని అభిలషిస్తూ ఇందుకు కారకులైన టీమ్ సభ్యులను అభినందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో ప్రారంభమైన అంతరిక్ష ప్రయోగాలు, ఆ తర్వాత 1975లో ఇందిరా గాంధీ హయాంలో ప్రారంభించిన ఆర్యభట్, ఆ తర్వాత 2008లో చంద్రయాన్, 2013లో మంగళయాన్ వంటివాటిని ప్రయోగించి అద్భుతమైన ఘనత సాధించిన మన శాస్తవ్రేత్తలు తాజాగా చంద్రయాన్-2ను ప్రయోగంతో మరో ఎత్తుకు ఎదిగారని పేర్కొన్నారు.