జాతీయ వార్తలు

హైవేలకు నిధులివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: తెలంగాణలోని జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు మంజురు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, రహదారుల విస్తరణ, పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలపై తెలంగాణ ఎంపీలతో గడ్కరీ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నామా నాగేశ్వరరావు నేతృత్వంలో లోక్‌సభ సభ్యులు ఈ సమవేశంలో పాల్గొన్నారు. అనంతరం నాగేశ్వరరావు విలేఖరులతో మాట్లాడుతూ ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించి, విస్తరించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు. ఇప్పటివరకు 1,388 కిలోమీటర్ల రోడ్లను మాత్రమే జాతీయ రహదారులగా కేంద్రం గుర్తించిందని.. ఇంకా 1,767 కిలోమీటర్ల రహదారులను గుర్తించాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రహదారల విస్తరణకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తులను సమర్పించినట్టు ఆయన వెల్లడించారు. ప్రధానంగా ఐదింటిని జాతీయ రహదారులుగా విస్తరించాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. హైదరాబాద్‌లోని గౌరెల్లి ఔటర్ రింగ్‌రోడ్ జంక్షన్ - వలిగొండ - తొర్రూర్ - నెల్లికుదురు - మహబూబాబాద్ - ఇల్లందు - కొత్తగూడెంలోని ఎన్‌హెచ్-30 మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించి విస్తరించాలని కోరినట్టు చెప్పారు. రాష్ట్రం వాటాగా భూసేకరణ, నిర్వాసితుల తరలింపు, పరిహారం, ఆటవీ భూముల మళ్లింపుతోపాటు 50 శాతం వ్యయం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే చెప్పారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. నామాతోపాటు ఎంపీలు మనె్న శ్రీనివాస్‌రెడ్డి, పి.రాములు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణలో జాతీయ రహదారులు విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. జాతీయ రహదారుల నిర్మాణం ఆలస్యమైతే సంబంధిత అధికారులతోపాటు తనపైనా కేసులు నమోదు చేయాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారని ఆయన అన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించినట్టు కోమటిరెడ్డి వెల్లడించారు.