జాతీయ వార్తలు

చంద్రయాన్-2లో నారీ శక్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూలై 22: అన్ని రంగాలతోపాటు అంతరిక్ష పరిశోధనలో ఇటీవల మహిళల పాత్ర ఎక్కువైంది. భాతర అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మహిళా శాస్త్రవ్రేత్తలనూ గుర్తిస్తోంది. రాకెట్ ప్రయోగాలతో పాటు వివిధ అంతరిక్ష పరిశోధన కేంద్రాల్లో మహిళలు రాటుదేలుతున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగ విజయంలో కూడా నారీ శక్తి కీలకంగా పని చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గుర్తింపులోకి వచ్చిన చంద్రయాన్-2 మిషన్ ప్రాజెక్టుల్లో సగానికి పైగా మహిళా శాస్త్రవ్రేత్తలు పాలుపంచుకొని తమ శక్తియుక్తులు చూపించారు. పురుషాధిక్యత ఉన్న ఈ రోజుల్లో కూడా అంతరిక్ష శాస్త్ర విజ్ఞాన రంగం, శాస్త్ర సాకేంతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో పురుషులు కంటే మహిళలు ఏమీ తీసిపోమంటూ చంద్రయాన్-2 ప్రయోగంలో మహిళలు ఎంతో కృషి చేశారు. జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3 రాకెట్ ద్వారా ప్రయోగించిన చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లను రూపొందించడంలో 30 శాతానికి పైగా మహిళా శాస్త్రవ్రేతలే ఉండడం విశేషం. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు ఉపగ్రహ తయారీ కేంద్రంలో పురుష శాస్తవ్రేత్తలతో సమానంగా తామేమి తక్కువ కాదని ఈ ప్రాజెక్టులో రేయింబవళ్లు పనిచేశారు. భారత్‌కు తలమానికంగా నిలిచే ఈ ప్రయోగంలో మహిళా శాస్తవ్రేత్తలు కృషి దాగి ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. ఇందులో ల్యాండర్ ప్రాజెక్టుకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎం.వనిత వ్యవహరించారు. అదేవిధంగా ముత్తయ్య వనిత యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో సిస్టమ్స్ ఇంజినీర్‌గా సేవలందించారు. ఈమె 2006లో బెస్ట్ మహిళా శాస్త్రవ్రేత్తగా అవార్డు కూడా అందుకున్నారు. అంతరిక్ష రంగంలోను, వ్యోమగాములకు అందించాల్సిన సహకారంపై ఈమె ఎంతో స్టడీ చేసి ఉన్నారు. కార్టోశాట్-1, ఓషన్‌శాట్-2 నిర్మాణంలో ఈమె డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా కూడా పని చేశారు. మంగళయాన్ ఉపగ్రహ తయారీలో కూడా కీలకపాత్ర పోషించారు. వీరిలో దాదాపు మరో 8 మంది మహిళలు చంద్రయాన్-2 నిర్మాణంలో కృషి ఉంది. వారిలో బాలుశ్రీ దేశాయ్, డాక్టర్ సీత, కె.కల్పన, టెస్సీ థామస్, టీకే అనూరాధ, రీతూ కారిథార్, డాక్టర్ నేహ సటక్ అనే మహిళా శాస్తవ్రేత్తలు ఈ ప్రయోగంలో పాలుపంచుకొని నారీ శక్తిని నిరూపించి అంతరిక్ష ప్రయోగాల్లో మహిళలూ కీలకమని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు.
చిత్రాలు.. చంద్రయాన్-2 ప్రాజెక్టులో కీలకపాత్ర పోషించిన మహిళా
శాస్త్రవ్రేత్తలు రీతూ కరిదార్, ముత్తయ్య వనిత