జాతీయ వార్తలు

పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 22: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధికి ‘ప్రత్యేక రాష్ట్రంగా’ చూస్తామని కేంద్ర రోడ్లు రహదారల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని వైసీపీ లోక్‌సభా పక్షంక్ష నాయకుడు పీవీ మిథున్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులు, రోడ్లు, రహదారుల పురోగతి తదితర అంశాలపై గడ్కరీ సోమవారం పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మిథున్‌రెడ్డి మాట్లాడుతూ తమ నాయకుడు విజయ సాయిరెడ్డి నేతృత్వంలో కేంద్ర మంత్రితో సమావేశమయ్యామని చెప్పారు. జాతీయ రహదారుల పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరినట్టు వెల్లడించారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా విస్తరించాలని.. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. ప్రాజెక్టులకు భూసేకరణ వ్యయం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కొంత ఖర్చును రాష్ట్రం భరించాలని కేంద్ర మంత్రి సూచించారని చెప్పారు. అమరావతి-అనంతపురం జాతీయ రహదారి నిర్మాణానికి ఉన్న సమస్యలను పరిష్కరించి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని కోరినట్టు చెప్పారు. జాతీయ రహదారుల అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా చూస్తామని గడ్కరీ హామీ ఇచ్చారని అన్నారు. జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రి కొన్ని సలహాలు, సూచనలు చేశారని అన్నారు. రహదారుల పురోగతిపై పూర్తి నివేదికతో మరోసారి సమావేశమవుతామని మిథున్‌రెడ్డి వెల్లడించారు.