జాతీయ వార్తలు

సైనిక స్ధావరంపై ఉగ్రపంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై జరిగిన ఉగ్రవాద దాడి ప్రకంపనలు తగ్గక ముందే పాకిస్తాన్ ముష్కర మూకలు మరోసారి భారత సైనిక స్ధావరంపై తెగబడ్డాయి. నిషిద్ధ జైషే మొహమ్మద్ సాయుధ ఉగ్రవాదులు యూరీలోని భారత సైనిక కేంద్రంపై ఆదివారం జరిపిన దాడిలో 17మంది సైనికులు మరణించారు. ఆదివారం తెల్లవారు జామున ఐదున్నరకు జరిగిన ఈ విఘాతక దాడిలో మరో 20మంది సైనికులు గాయపడ్డారు. అనంతరం మూడు గంటల పాటు జరిగిన హోరాహోరీలో నలుగురు మిలిటెంట్లను సైనిక దళాలు హతమార్చాయి. జవాన్లు నిద్రపోతున్న టెంట్లకు నిప్పంటుకోవడం వల్లే ఎక్కువ మరణాలు సంభవించాయి. ఈ దాడిని భారత్ తీవ్ర పదజాలంతో ఖండించింది. దీన్ని పిరికిపందల చర్యగా ప్రధాని మోదీ గర్హించారు. ఇందుకు బాధ్యులైన వారిని వదిలేది లేదన్నారు. ఇలాంటి దాడులకు భారత్ తలవంచదని రాష్టప్రతి ప్రణబ్ అన్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. పాక్ ఉగ్రవాద దేశమని, దాన్ని ప్రపంచ దేశాలు ఏకాకిని చేయాల్సిందేనని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. దాడి వెనుక జైషే మొహమ్మద్ హస్తం ఉన్నట్టుగా స్పష్టమైన ఆధారాలున్నాయని డిజిఎమ్‌ఓ నిగ్గుదేల్చారు. ఉగ్రవాదుల వద్ద లభించిన వస్తువులు పాకిస్తాన్‌కు చెందినవేనన్న మార్కింగ్‌లు ఉన్నాయి. హతులైన మిలిటెంట్ల వద్ద ఎకె 47 రైఫిళ్లు, ఇతర ఆయుధాలు దొరికాయి. దాడి వార్త తెలిసిన వెంటనే ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ యూరి సెక్టార్‌కు తరలివెళ్లారు. గోవా పర్యటనను రద్దు చేసుకుని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా కాశ్మీర్ చేరుకుని పరిస్థితి సమీక్షించారు. దేశ రాజకీయ నాయకత్వం ముక్తకంఠంతో దాడిని ఖండించింది. బాధ్యుల్ని వదిలి పెట్టడానికి వీల్లేదని పిలుపునిచ్చింది. కాశ్మీర్‌లో యుద్ధ వాతావరణం సృష్టించడమే దాడి లక్ష్యంగా కనిపిస్తోందని సిఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. కాగా, జైషే విఘాతక చర్యను అమెరికా సహా అనేక దేశాలు ఖండించాయి.