జాతీయ వార్తలు

‘వ్యాపం’ బాధితులకు న్యాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, జూలై 23: వ్యాపం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులు తాము చేసిన తప్పును ఒప్పుకున్నందున వారికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఈనెల 21న రాసిన సుదీర్ఘ లేఖలో హర్యానా టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో జరిగిన అంశాలను ఈ సందర్భంగా ఉదహరించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం వృత్తివిద్యా కోర్సులతోపాటు రాష్ట్ర సర్వీసుల్లో ప్రవేశానికి ఉద్దేశించి నిర్వహించిన వ్యవసాయిక్ పరీక్ష మండల్ లేదా వ్యాపం పరీక్షలో అనేక అవకతవకలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ‘నగదు మార్పిడితోపాటు సదరు విద్యార్థుల కాల్ డేటా వివరాలు సమగ్రంగా దొరికినందున, విచారణలో సైతం వారు తాము తప్పు చేసినట్టు అంగీకరించడంతో ఈ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిని పట్టుకోవచ్చు. ఇదే సందర్భంలో అమాయకులకు తగిన న్యాయం జరుగుతుంది’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కుంభకోణం అంశాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడంతోపాటు ఈ విషయంలో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీమ్ (సిట్)కు తగిన ఆధారాలను సమర్పించినందున రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. వ్యాపం పరీక్షలో ఎంపిక కాకపోయినా ఈ కుంభకోణంలో పాత్ర కలిగిన విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని ఆయన సూచించారు. అదేవిధంగా వ్యాపం కుంభకోణంలో ఒకపక్క కేసులు ఎదుర్కొంటూ, మరోపక్క వయసు మీరుతున్న విద్యార్థులను మానవతా దృక్పథంతో క్షమించి వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని ఆయన సూచించారు. వ్యాపం కుంభకోణంలో మూడు వేల మందికి పైగా ఇరుక్కున్నారని, వీరిలో 1450 మంది విద్యార్థులు ఉన్నారని, వారిందరిపై కేసులు నమోదయ్యాయని, వీరిలో ఇప్పటికే 45 మంది నిందితులు మరణించారని దిగ్విజయ్ సింగ్ తన లేఖలో పేర్కొన్నారు.