జాతీయ వార్తలు

లాలూ, అఖిలేష్ భద్రత తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో సహా పలువురు ముఖ్య నేతల భద్రతను కుదించడం, మరి కొంత మంది నేతల భద్రతను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దేశ వ్యాప్తంగా 130 మంది వీఐపీలకు, ముఖ్య నేతలకు కల్పిస్తున్న నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జీ) భద్రత, ‘జెడ్+’ క్యాటగిరి, ‘జెడ్’ క్యాటగిరిపై సమీక్షించింది. ‘జెడ్’ క్యాటగిరిలో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ, మాజీ ఎంపీలు కీర్తి ఆజాద్, శతృఘ్న సిన్హా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కొత్తగా నియమితులైన కల్‌రాజ్ మిశ్రా, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, ప్రణబ్ ముఖర్జీ ఇద్దరు మనవరాళ్ళు, మనవడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె, మనవడికి కల్పిస్తున్న భద్రతను కేంద్రం తొలగించింది. వీరికి ఆర్మీ (సీఆర్‌పీఎఫ్) కమాండోలు, సీఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌జీ భద్రత ఉంది.
ఇలాఉండగా ఉత్తర్ ప్రదేశ్ మంత్రి సురేష్ రానా, బీహార్ ఎంపీ వీణా దేవి, మాజీ ఉదయ్ సింగ్, ఉత్తర్ ప్రదేశ్ మంత్రి బ్రిజేష్ పట్నాయక్, బీజేపీ నాయకుడు అనుపమ్ హజ్ర, ఇస్రో చైర్మన్ కె. శివన్, మాజీ సైంటిఫిక్ సలహాదారుడు ఆర్. చిదంబరం, కాంగ్రెస్ నాయకుడు దీపేంద్ర హూడా, బీజేపీ రాజ్యసభ ఎంపీ ఓపీ మాథుర్, ఆచార్య ప్రమోద్ కృష్ణం, ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ఇంద్రజిత్ కుమార్, బీజేపీ మాజీ ఎంపీ ఉదిత్ రాజ్, బీజేపీ సిట్టింగ్ ఎంపీ రాం శంకర్ ఖతిరియా పేర్లను భద్రతా జాబితాలో చేర్చింది. వీరికి కేంద్ర భద్రతా దళాల రక్షణ కల్పిస్తారు.
ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ, కాంగ్రెస్ నాయకుడు అవతార్ సింగ్ బదానా, పంజాబ్ మంత్రి రాణా గుర్మిత్ సోధి, బీహార్ మాజీ ఎంపీ సాబిర్ అలీ, కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ భజ్వా, మణిపూర్ వర్సిటీ వీసీ ఆద్య ప్రసాద్ పాండే, అంతరిక్ష శాస్తవ్రేత్త టీకె అలెక్స్ పేర్లను కేంద్ర హోం మంత్రి సూచన మేరకు భద్రత తొలగించారు.