జాతీయ వార్తలు

హక్కుల చట్టానికి తూట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా నీరుగార్చే లక్ష్యంతోనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని యుపీయే చైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. విస్తృత సంప్రదింపులు, చర్చోపచర్చలు అనంతరం పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ చట్టం మోదీ సర్కారు తీరు వల్ల కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తాజాగా ఈ చట్టానికి చేసిన సవరణలను ప్రస్తావించిన సోనియా గాంధీ.. కేంద్ర సమాచార కమిషన్ స్వేచ్ఛాయుత పనితీరుకే విఘాతం కలిగిస్తోందని ఓ ప్రకటనలో సోనియా అన్నారు. అయితే, ప్రభుత్వ తీరువల్ల ఆర్టీఐ చట్టం అవసాన దశకు చేరుకున్నట్లు కనిపిస్తోందని.. దీనిని ఓ ‘న్యూసెన్స్’గా ప్రభుత్వం భావిస్తోందని సోనియా అన్నారు. ఈ లక్ష్యంతోనే కేంద్ర సమాచార కమిషన్ హోదాను, స్వాతంత్య్రాన్ని హరిస్తోందన్నారు. ఆర్టీఐ చట్టం విషయంలో కేంద్రం తీరు ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్న సోనియా.. ‘గత దశాబ్ద కాలంలో 60 లక్షల మందికి పైగా దేశ ప్రజలు ఈ చట్టాన్ని ఉపయోగించుకొన్నారు.. దీనివల్ల పాలనా వ్యవస్థలోని అన్ని స్థాయిల్లో జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందాయి’ అని తెలిపారు.
‘ట్రంప్ జోక్యం’పై వివరణకు విపక్షాల డిమాండ్
కాశ్మీర్ అంశంపై తనను జోక్యం చేసుకోవాలని భారత ప్రధాని మోదీ కోరారంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై దుమారం మొదలైంది. లోక్‌సభలో మంగళవారం ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తరఫున ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మనీష్ తివారీ ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీశారు. వాషింగ్టన్‌లో సోమవారం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ కాశ్మీర్ అంశంపై తన జోక్యాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరారంటూ చేసిన వ్యాఖ్యలపై మోదీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ ఓ ఫైల్‌ను తీసుకొచ్చిన ఫైల్‌లోని కొన్ని పేపర్లను కాంగ్రెస నాయకురాలు సోనియాగాంధీ తివారీకి అందజేశారు. అయితే, ఈ అంశంపై సోనియా ఎటువంటి వ్యాఖ్య చేయకుండానే తిరిగి తన స్థానంలోకి వెళ్లిపోవడం విశేషం. కాంగ్రెస్‌తో పాటు టీఎంసీ సభ్యుడు సౌగతా రాయ్, డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు జతకలిసి ఈ అంశంపై మోదీ వివరణ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. కాగా, ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది.

చిత్రం...యుపీయే చైర్‌పర్సన్ సోనియా గాంధీ