జాతీయ వార్తలు

యూరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూరి, సెప్టెంబర్ 18: జమ్మూ, కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌కు చెందిన మిలిటెంట్లుగా భావిస్తున్న సాయుధ మిలిటెంట్లు ఆదివారం తెల్లవారుజామున బారాముల్లా జిల్లా యూరి సెక్టార్‌లోని సైనిక స్థావరంపై గ్రెనేడ్లు, ఎకె రైఫిళ్లతో దాడి చేయడంతో 17 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ దాడికి బాధ్యులైన వారిని శిక్షించకుండా వదిలిపెట్టేది లేదని ప్రకటించారు. అధీన రేఖ (ఎల్‌ఓసి)కి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆర్మీ స్థావరం రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెల్లవారుజామున అయిదున్నర గంటల సమయంలో ఈ స్థావరంపై దాడిచేసిన మిలిటెంట్లు మొదట గ్రెనేడ్లు విసిరి ఆ తర్వాత కాల్పులకు తెగబడ్డారు. ఆర్మీ స్థావరంలో ఎక్కువ మంది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్లలోనే నిద్రిస్తుండడం, గ్రెనేడ్ దాడితో టెంట్లకు నిప్పు అంటుకోవడంతోనే ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. డోగ్రా రెజిమెంట్‌కు చెందిన 17 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా, వీరిలో 13 మంది టెంట్లు తగులబడ్డం కారణంగానే చనిపోవడం గమనార్హం. మరో 20 మంది గాయపడగా, వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్ ఆస్పత్రికి హెలికాప్టర్లలో తరలించారు. అనంతరం మూడు గంటలకుపైగా సైనికులకు, మిలిటెంట్లకు మధ్య జరిగిన భీకరపోరులో భద్రతా దళాలు నలుగురు మిలిటెంట్లను మట్టుబెట్టాయి. ఆ ప్రాంతంలో మరెవరూ మిలిటెంట్లు లేకుండా ఏరివేయడం కోసం సైన్యం పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది.
ఈ దాడి వార్త తెలిసిన వెంటనే సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దల్బీర్ సింగ్ హుటాహుటిన శ్రీనగర్ చేరుకున్నారు. గోవా పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి పారికర్ సైతం తన పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకుని శ్రీనగర్ వచ్చారు. శ్రీనగర్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో దాడి వివరాలను ఆర్మీ అధికారులు పారికర్‌కు వివరించారు. దాడి వార్త తెలియగానే తన అమెరికా, రష్యా పర్యటనను రద్దు చేస్తుకున్న హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు.
మిలిటెంట్లు ఆర్మీ బేస్‌పై దాడి చేయగానే పెద్దఎత్తున పేలుళ్లు, తుపాకీ కాల్పులు మొదలయ్యాయి. పేలుళ్ల కారణంగా జవాన్లు నిద్రిస్తున్న టెంట్లు అంటుకున్నాయని, చనిపోయిన వారిలో 12-13 మంది టెంట్లు తగులబడ్డం కారణంగానే చనిపోయారని ఆర్మీ అధికారులు చెప్పారు. మంటలు చుట్టుపక్కల బ్యారక్‌లను కూడా చుట్టుముట్టాయని వారు చెప్పారు. కాగా, ఆర్మీ చేతిలో హతమైన నలుగురు విదేశీ మిలిటెంట్లు ఉపయోగించిన ఆయుధాలు, పరికరాలపై పాకిస్తానీ మార్కింగ్‌లు ఉండడం పట్ల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ (డిజిఎంఓ) లెఫ్టెనెంట్ జనరల్ రణబీర్ సింగ్ పాకిస్తాన్ డిజిఎంఓకు ఫోన్ చేసి తీవ్ర నిరసన తెలియజేశారు. చనిపోయిన నలుగురు మిలిటెంట్లు కూడా జైషే మహమ్మద్ తంజీమ్ ముఠాకు చెందిన వారని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందని ఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌లో మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో రణబీర్ సింగ్ తెలిపారు. మిలిటెంట్ల వద్దనుంచి నాలుగు ఎకె-47 రైఫిళ్లు, నాలుగు అండర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్లు, పెద్ద సంఖ్యలో ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మిలిటెంట్లను పూర్తిగా ఏరిపారేయడానికి సంబంధించి యూరి బేస్ చుట్టుపక్కల ప్రాంతంలో గాలింపు ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, అందువల్ల పూర్తి వివరాలు ఇంకా తెలియవని ఆయన చెప్తూ, మిలిటెంట్లను మట్టుబెట్టడంలో జవాన్లు అత్యున్నత స్థాయి ప్రొఫెషనలిజంను, మొక్కవోని ధైర్య సాహసాలను ప్రదర్శించారని ఆయన చెప్పారు. ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ ఆపరేషన్ జరిగిన చోటును సందర్శించి పరిస్థితిని అంచనా వేసినట్లు రణబీర్ సింగ్ చెప్పారు.