జాతీయ వార్తలు

68శాతం అవినీతి కేసుల్లో శిక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సిబిఐ) గత పదేళ్లలో ఏడు వేల కేసులను అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తు చేస్తే ఇందులో 6533 కేసుల్లో కోర్టు విచారణ ముగిసింది. ఇందులో 4054 కేసుల్లో నిందితులకు జైలు శిక్ష ఖరారైంది. సిబిఐలో సిబ్బంది సంఖ్య తక్కువగా ఉన్నా, కోర్టుల్లో తగినంత మంది సిబ్బంది, న్యాయమూర్తుల సంఖ్య లేకపోయినా, పటిష్టమైన ప్రాసిక్యూషన్‌ను నిర్వహించి రికార్డు స్ధాయిలో అవినీతి అధికారులకు శిక్షపడేటట్లు చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో విడుదల చేసిన గణాంక వివరాల ప్రకారం 2006 నుంచి 2016 సంవత్సరం మధ్య సిబిఐ 6533 కేసులను అవినీతి నిరోధకచట్టం కింద నమోదు చేసింది. వీటిలో 68 శాతం కేసుల్లో దోషులకు జైలు శిక్ష పడింది. 32 శాతం కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. 9.5శాతం సరైన ఆధారాలు దొరక్క మూసేస్తున్నారు.
సిబిఐ అధికారులు 2015లో దేశం మొత్తం మీద బంగారం నుంచి అక్రమ రవాణాగా వచ్చిన రూ. 1439.83 కోట్ల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రూ.254.70కోట్ల బంగారం, రూ.95.17 కోట్ల మాదకద్రవ్యాలు, రూ.10.99 కోట్ల నకిలీ కరెన్సీ, రూ.0.17 కోట్ల ఫ్యాబ్రిక్స్, సిల్క్, నూలు, రూ. 787.15 కోట్ల విలువైన యంత్ర పరికరాలు, రూ. 68.15 కోట్ల వాహనాలు, రూ. 215.2 కోట్ల విలువైన వివిధ వస్తువులను సిబిఐ స్వాధీనం చేసుకుంది. కస్టమ్స్ చట్టం కింద 390 మంది అరెస్టు మందిని అరెస్టు చేయగా, 40 మందిని ప్రాసిక్యూట్ చేశారు. 11 మందికి శిక్షలు పడ్డాయి. దేశంలో 89307 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 7880 మందిని అరెస్టుచెశారు. దాదాపు 1422కేజీల హెరాయిన్ స్వాధీనం కేసుల్లో 3900 మందిని, 3350 కేజీల హాషిస్ మత్తు మందు స్వాధీనం కేసుల్లో 2285మందిని అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల అక్రమరవాణా కేసుల్లో 203 మంది విదేశీయులతో సహా 32069 మందిని అరెస్టుచేశారు.