జాతీయ వార్తలు

నా కుమారుడు కాబట్టే గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, సెప్టెంబర్ 18: ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాది పార్టీ అధినేత కుటుంబంలో నెలకొన్న వివాదం సమసిపోయినప్పటికీ, పార్టీ విజయంకోసం అఖిలేష్ యాదవ్ చేసిన కృషిని ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ప్రశ్నించే దాకా ఈ వ్యవహారం వెళ్లినట్లు తెలుస్తోంది. 2012 ఎన్నికల్లో విజయం అనంతరం అఖిలేష్ యాదవ్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడాన్ని శివపాల్ వ్యతిరేకించాడనీ, 2014 ఎన్నికల తర్వాతనే అతనికి ఆ హోదా ఇవ్వాలని సూచించాడని ములాయం వెల్లడించినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. ‘అప్పట్లో శివపాల్ మాట విని వుంటే 30 నుంచి 35 సీట్లను గెలుచుకుని ప్రధానమంత్రిని అయ్యుండేవాడిని. శివపాల్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించడంపై అఖిలేష్‌కు అసంతృప్తి ఉన్నప్పుడు, నా కుమారుడు అయినందువల్లే రాష్ట్ర ప్రజలు అతన్ని ముఖ్యమంత్రిగా అంగీకరించారనే విషయాన్ని కూడా అఖిలేష్ గుర్తుంచుకోవాలి. రాజకీయపరంగా అఖిలేష్‌కు ఎలాంటి వ్యక్తిగత గుర్తింపు లేదని తెలుసుకోవాలి’ అని ములాయం వ్యాఖ్యానించినట్లు ఆ పత్రిక పేర్కొంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ములాయంసింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. 2012 ఎన్నికల్లో అఖిలేష్ గెలిచాడనీ, శివపాల్, రామ్‌గోపాల్ యాదవ్‌లతో కలిసి ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించాడని ములాయం పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న కన్యా విద్యాదాన్, రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఉచిత మందులు వంటి పథకాలన్నీ నేను ప్రారంభించాడనీ అఖిలేష్ చెపుతున్నాడు. ప్రస్తుతం అతను రాష్ట్రంలో అత్యున్నత హోదాలో కొనసాగుతున్నాడు. అందరినీ ఎలా కలుపుకునిపోవాలో అఖిలేష్ తెలుసుకోవాలి’ అని ములాయం చురక వేసినట్లు తెలుస్తోంది.