జాతీయ వార్తలు

తాత్సారం క్షంతవ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: కాశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో ఆర్మీ బెటాలియన్‌పై జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో సర్వత్రా ఖండనలు వెల్లువెత్తుతున్నాయి. అనేకసార్లు ఈ రకమైన ఘాతుకాలకు ఒడిగడుతున్న పాకిస్తాన్‌కు సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్న దానిపై నిపుణులు కూడా కఠినమైన పదజాలంతోనే తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం పేలవంగా దాడిని ఖండించడంతో సరిపెట్టకుండా సైనిక దాడి అవకాశాలను కూడా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా వుందని మాజీ సైనికులు స్పష్టం చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద మూకలపై సైనిక దాడి జరిపే అంశాన్ని కూడా భారత్ పరిశీలించడం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎంతో అవసరమని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) బిఎస్ జైశ్వాల్ సూచించారు. ఉగ్రవాద మూకలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ వెన్నుదన్నుగా ఉంటుందని జైశ్వాల్ తెలిపారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేస్తే తప్ప ఈ రకమైన దాడులను రూపుమాపడం సాధ్యం కాదన్నారు. ఎలాంటి దాడులకు పాల్పడ్డా భారత్ తమపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్న నమ్మకంతోనే పాకిస్తాన్ ఈ రకమైన ఉగ్రవాద చర్యలకు అదే పనిగా పాల్పడుతూ వస్తోందని మరో మాజీ సైనికాధికారి గౌరవ్ ఆర్యా అన్నారు. జమ్ము కాశ్మీర్ భద్రతా పరిస్థితిలో తనకు లోతైన అవగాహన ఉందని పేర్కొన్న ఆయన, ఆ రాష్ట్రంలో సమస్యలను ఉద్దేశపూర్వకంగానే సృష్టిస్తున్నారని, ఇందుకు మూలకేంద్రంగా పాకిస్తాన్‌లోని రావల్పిండి పనిచేస్తోందని ఆరోపించారు. యూరి దాడి తీవ్రత నేపథ్యంలోనైనా భారత్ తక్షణ చర్యలకు ఒడిగట్టాలని, ముఖ్యంగా పాకిస్తాన్‌తో వ్యాపార, వాణిజ్య సంబంధాలను నిలిపివేయాలని ఆయన సూచించారు. పాకిస్తాన్‌కు ఇస్తున్న అత్యంత ప్రాధాన్యతాపూర్వక దేశం (ఎంఎఫ్‌ఎన్) హోదాను కూడా తగ్గించే అంశాన్ని భారత్ పరిశీలించాలని అన్నారు. గతంలో మాదిరిగా కాకుండా, తాజా ఘటన నేపథ్యంలో పాక్‌పై భారత్ తీవ్ర ఆగ్రహంతోనే ఉందన్న వాస్తవాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయాల్సిన అవసరముందని అన్నారు.
హోంమంత్రి రాజ్‌నాథ్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇద్దరు సైనిక దళాల ప్రధానికారులు హాజరుకాకపోవడాన్ని మాజీ ఆర్మీ చీఫ్ శంకర్ రాయ్ చౌదరి నిరసించారు. ప్రధాన మంత్రి తర్వాత అత్యంత కీలకమైన స్థానంలో ఉన్న హోంమంత్రి నిర్వహించిన సమావేశానికి ‘రా’ చీఫ్ అలాగే సిఆర్‌పిఎఫ్ ప్రధానాధికారి ఎందుకు హాజరుకాలేదని ఆయన నిలదీశారు. అలాగే నేవీ చీఫ్ కూడా ఎక్కడుతున్నారని, ఆర్మీ చీఫ్ ఏంచేస్తున్నారని పేర్కొన్న ఆయన, ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వానికి సలహా ఇవ్వడం వారి బాధ్యత కాదా అని మండిపడ్డారు.

చిత్రాలు..యూరిలోని భారత ఆర్మీ స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సిద్ధమైన ఓ జవాను. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న హెలికాప్టర్