జాతీయ వార్తలు

రక్షణ స్థావరాలే లక్ష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: జమ్మూ, కాశ్మీర్‌లో ఆత్మాహుతి దాడులకు తెగబడుతున్న ఉగ్రవాదులు మరోసారి రక్షణ స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తమ బలాన్ని చాటుకోవడానికి ఈ శక్తులు ఆర్మీ స్థావరాలపై దాడులు చేస్తున్నాయేమోననిపిస్తోంది. కాశ్మీర్ అట్టుడికిపోతున్న తరుణంలో రాష్ట్రంలో మరోసారి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ఈ ఉగ్రవాద శక్తులు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆందోళనకారులతో సంధి కుదుర్చుకోవడానికి సైన్యం లేదా ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయాలనుకున్నా ఈ దాడులు విఘాతం కలిగిస్తాయి.
జమ్మూ, కాశ్మీర్‌లో 2013 మార్చినుంచి ఆత్మాహుతి దాడులు పెరిగి పోయాయి. 1999-2002 మధ్య కాలంలో కాశ్మీర్‌లో ఉగ్రవాదం తారస్థాయికి చేరుకున్న సమయంలో సైతం ఇదే ధోరణి ఉండేది. ఒక్క 2001లోనే ప్రభుత్వ సంస్థలు, సైనిక స్థావరాలపై 25దాకా దాడులు జరిగాయి. వందలాది పౌరుల ప్రాణాలను హరించిన దాడుల లెక్కలు వేరే ఉన్నాయి. ఇంతకు ముందు అధీన రేఖకు దగ్గర్లో ఉన్న భద్రతా దళాల స్థావరాలపై ఉగ్రవాద దాడులు జరిగేవి. అయితే ఇప్పుడు దానికి భిన్నమైన ధోరణి కనిపిస్తోంది. ఇంతకుముందు పటాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడి ఆదివారం యూరి సెక్టార్‌లో సైనిక స్థావరంపై జరిగిన దాడి దీనికి ఒక నిదర్శనం. తమ వేర్పాటువాద అజెండాలను నిర్విఘ్నంగా అమలు చేయడానికి, రాష్ట్రాన్ని రాజకీయ గందరగోళంలో ఉంచడానికి ఆత్మాహుతి దాడులు మిలిటెంట్లకు తిరుగులేని అస్త్రంగా ఉన్న విషయం తెలిసిందే. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడి, ఇప్పుడు యూరిలో ఆర్మీ బేస్‌పై జరిగిన దాడి ఈ ఆత్మాహుతి దాడులకు పరాకాష్ఠలని చెప్పవచ్చు. ఇక మరణాల విషయానికి వస్తే యూరి సంఘటన పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దాడికంటే ఎన్నో రెట్లు తీవ్రమైంది.

చిత్రం.. యూరిలోని భారత ఆర్మీ రక్షణ స్థావరం