జాతీయ వార్తలు

పిరికిపంద చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: యూరిలో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధాన రాజకీయ పార్టీలు, నేతలు తీవ్రంగా ఖండించారు. దేశంలో శాంతి సామరస్యాలను దెబ్బతీసేందుకే ఉగ్రమూకలు ఇలాంటి పిరికిపంద దాడులకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని, వారి వెనుక ఉన్న శక్తులను కఠినంగా శిక్షిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. యూరి ఉగ్రదాడిలో మృతి ందిన సైనికుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ఈ దాడిని ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
యూరీ దాడిని ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న సిపిఎం కేంద్ర కమిటీ సమావేశం తీవ్రంగా ఖండిస్తూ ఉగ్రవాద శక్తులకు ప్రోత్సాహం అందించడాన్ని నిలిపివేయాలని పాక్‌ను కోరింది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడడాన్ని నిలిపివేసి తీరాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఉగ్రవాద శక్తులకు సహాయ సహకారాలు, ప్రోత్సాహాన్ని అందించడాన్ని పాకిస్తాన్ ఆపివేయాలని, ఎందుకంటే ఇలాంటి చర్యలు దక్షిణాసియాలో శాంతి ప్రక్రియకు పెద్దఅడ్డంకి అని సిపిఎం ఒక ప్రకటనలో పేర్కొంది. జమ్మూ, కాశ్మీర్ అంతటా పెద్ద ఎత్తున సైనికులను మోహరించినప్పటికీ కొనసాగుతున్న మిలిటెంట్ల చొరబాట్లను ఆపడంలో ప్రభుత్వం విఫలమైందని కూడా ఆ పార్టీ విమర్శించింది. ‘ఈ దాడి ఎంతమాత్రం క్షమార్హం కాదు.. ఇలాంటి చర్యల ద్వారా వారు మనల్ని బెదిరిస్తూనే ఉన్నారు. అయితే తన అంతర్గత భద్రతను కాపాడుకోగల సత్తా భారత్‌కు ఉందని, ఇలాంటి చర్యలతో జమ్మూ, కాశ్మీర్‌లో శాంతిని పునరుద్ధరించకుండా ఏ శక్తీ మనల్ని అడ్డుకోజాలదు’ అని బెంగళూరులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కాగా, యూరిలో ఉగ్రవాద దాడి ఎంతో బాధకలిగించిందని మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒక ట్వీట్‌లో అంటూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగనిరతికి సెల్యూట్ చేస్తున్నానని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్‌దాస్ సైతం ఉగ్రదాడిని ఖండిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అమెరికా ఖండన
17 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు మన దేశంలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ ఒక ట్వీట్‌లో తెలిపారు.

చిత్రం.. యూరి దాడికి నిరసనగా ఆదివారం అమృత్‌సర్‌లో పాకిస్తాన్ జెండాలను తగులబెడుతున్న జాతీయ మానవ హక్కుల, నేరాల నిరోధక సంస్థ కార్యకర్తలు