జాతీయ వార్తలు

పాక్ ఉగ్రవాద దేశమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని, దాన్ని ఏకాకిగా మార్చాల్సిందేనంటూ భారతదేశం ఉద్ఘాటించింది. జమ్ము కాశ్మీర్‌లోని యూరి సైనిక స్థావరంపై మిలిటెంట్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మిలిటెంట్ చర్యను ఖండిస్తూ హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పదునైన పదజాలంతో పాకిస్తాన్‌పై నిప్పులు చెరుగుతూ ఒక ప్రకటన జారీ చేశారు. యూరి సెక్టార్‌లోని ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన దాడి ఒక పథకం ప్రకారం జరిగిందేనని వెల్లడించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులందరూ అన్ని విధాలా సుశిక్షితులేనని, భారీ ఆయుధాలతో ఈ ఘాతుకానికి ఒడిగట్టారని రాజ్‌నాథ్ అన్నారు. ఈ అమానుష కృత్యానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని, వారిని మట్టుబెడతామని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి, ఉగ్రవాద గ్రూపులకు ప్రత్యక్షంగానే మద్దతు ఇవ్వడం పట్ల రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. పాకిస్తాన్ అనుసరిస్తున్న ఈ ధోరణి కారణంగానే శాంతియుత పరిస్థితులకు విఘాతం కలుగుతోందన్నారు. ఇలాంటి ఉగ్రవాద కృత్యాలను ప్రోత్సహిస్తూ, ఉగ్రవాదానికి మద్దతిస్తూ సాగుతున్న పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని, దాన్ని ప్రపంచ సమాజం నుంచి ఏకాకిని చేయాలని రాజ్‌నాథ్ తెలిపారు. మిలిటెంట్ దాడి అనంతరం ఉన్నతాధికార సమావేశంలో కాశ్మీర్ శాంతి భద్రతల పరిస్థితిని ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో జరిపిన చర్చలను ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన వివరించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, హోం, రక్షణ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతోపాటు సైన్యం, పారా మిలిటరీ దళాలకు చెందిన అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. యూరిపై దాడి జరిపిన ఉగ్రవాదులు అన్ని విధాలుగా సుశిక్షితులని, భారీ ఆయుధాలతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్న విషయం అక్కడ ఆనవాళ్లను బట్టి స్పష్టమవుతోందని రాజ్‌నాథ్ తెలిపారు. ఈ ఘటనలో మరణించిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని, గాయపడ్డ సైనికులు త్వరగా కోలుకోవాలని రాజ్‌నాథ్ ఆకాంక్షించారు. ఈ ఘటన కారణంగా తాను జరపాల్సిన రష్యా, అమెరికా పర్యటనలను రాజ్‌నాథ్ వాయిదా వేసుకున్నారు.

చిత్రం.. యూరి సెక్టార్ ఉగ్రవాద దాడి అనంతరం రక్షణ శాఖ ముఖ్యులతో సమావేశమైన రాజ్‌నాథ్