జాతీయ వార్తలు

మాకు ఎవరి సర్ట్ఫికెట్లు అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: న్యాయమూర్తులకు ఎవరినుంచి ఎలాంటి యోగ్యతా పత్రాలు అవసరం లేదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. హైకోర్టుల్లోనూ, సుప్రీంకోర్టులోనూ న్యాయమూర్తుల నియామకం నిస్పాక్షికంగా జరిగేందుకు ఇటు న్యాయవ్యవస్థ, ఇటు కార్యనిర్వాహక వ్యవస్థతో సంబంధం లేకుండా ఒక స్వతంత్ర ప్రజా వ్యవస్థను ఏర్పాటుచేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఈ భూమీద ఎవరినుంచి మాకు యోగ్యతాపత్రాలు అవసరం లేదు’ అంటూ న్యాయమూర్తులు అరుణ్ కె.మిశ్రా, యు.యు.లలిత్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించింది. ఈ వాదనలో పస లేదని, అందుకే స్వీకార దశలోనే తిరస్కరిస్తున్నామని న్యాయమూర్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో పిటిషన్ దాఖలు చేసిన సంస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మీ వాదన తప్పో ఒప్పో మేమేమీ మాట్లాడటం లేదు. అయితే కొన్ని రాజ్యాంగ నిబంధనలను రద్దుచేస్తే తప్ప మీ డిమాండ్ నెరవేరే అవకాశం ఉండదు’ అని వివరించారు. జాతీయ న్యాయవాదుల సంస్థ తరపున న్యాయవాదులు మాథ్యూ జె. నెదుంపారా, ఎ.సి.్ఫలిప్ వాదనలు వినిపించారు. అన్నివిధాలుగా అర్హతలున్న వ్యక్తులను న్యాయమూర్తులుగా నియమించే ప్రతిపాదనను ఇప్పటివరకు కొలీజియం అసలు పరిశీలించనే లేదని పిటిషన్‌దారు ఆరోపించారు.