జాతీయ వార్తలు

నీళ్లు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 20: తమిళనాడుకు రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పున 27వరకూ కావేరీ జలాలను విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన తాజా ఆదేశాన్ని అమలు చేయలేమని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. దీనిపై తీసుకోవాల్సిన తదుపరి చర్యపై చర్చించేందుకు బుధవారం అఖిల పక్ష సమావేశాన్ని, కేబినెట్ భేటీనీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వును జారీ చేసింది. అయితే దాన్ని అమలు చేయడానికి మా వద్ద నీళ్లే లేవు. ఈ ఉత్తర్వును అమలు చేయలేం’ అని సిద్ధరామయ్య వెల్లడించారు. తమ రాష్ట్రంలో సాంబ పంట నష్ట పోకుండా ఉండాలంటే మరింత ఎక్కువ పరిమాణంలో కావేరీ జలాలను అందించాలని తమిళనాడు కోరడమే తాజా ఆదేశానికి కారణం.