జాతీయ వార్తలు

పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నం..10మంది ఖతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరీ/ నౌగామ్, సెప్టెంబర్ 20: కాశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాద దాడి జరిగి రెండు రోజులు తిరక్కుండానే పాక్ మిలిటెంట్లు మంగళవారం రెండుచోట్ల చొరబాట్లకు యత్నించారు. మొత్తం 15మంది ఉగ్రవాదులు ఆధీన రేఖ ప్రాంతం నుంచి కాశ్మీర్‌లోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని సైనిక దళాలు తిప్పికొట్టాయి. హోరాహోరీ కాల్పుల్లో పది మంది ఉగ్రవాదులు హతులయ్యారు. భారత జవాన్ ఒకరు మరణించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ దళాలు పలుచోట్ల భారత సైనిక స్థావరాలపై కాల్పులకు తెగబడ్డాయి. ఎలాంటి కవ్వింపు లేకుండా ఉగ్రవాదులు ఒక్కసారిగా సైనిక స్థావరాలపై కాల్పులకు దిగారు. ఈ సంఘటనలో ప్రాణనష్టంగానీ ఆస్తి నష్టంగానీ జరుగలేదని సైనికాధికారి ఒకరు తెలిపారు. 18మంది సైనికులను బలిగొన్న ఉరీ సంఘటనపై ఏవిధంగా ప్రతిస్పందించాలన్న దానిపై కేంద్రం అనేక అంశాలను పరిశీస్తున్న నేపథ్యంలో తాజా చొరబాటుయత్నం జరగడం గమనార్హం. పాక్‌కు ఏ విధంగా బుద్ధి చెప్పాలి.. సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చించేందుకు భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమవుతోంది. ఉరీ, నౌగామ్ సెక్టార్లలో చొరబడేందుకు రెండుసార్లు పాక్ ఉగ్రవాదులు ఆధీన రేఖ ప్రాంతం నుంచి ప్రయత్నించారని, సైనిక దళాలు వారిని తిప్పికొట్టాయని ఆర్మీ ప్రతినిధి తెలిపారు. ఎదురుకాల్పుల్లో ఎంత మంది మిలిటెంట్లు మరణించారో వెల్లడించని ఆయన తగిన సమయంలో ఈ వివరాలను బహిర్గతం చేస్తామన్నారు. నౌగామ్ సెక్టార్‌లో జరిగిన జవాను మరణించిన విషయాన్ని సైనిక ప్రతినిధి ధృవీకరించారు. ఈ రెండు ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో నిఘా కొనసాగుతోందన్నారు. ఇదిలా ఉండగా తాజా పరిస్థితుల నేపథ్యంలో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతాధికారులతో కాశ్మీర్ పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశంలో ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. సంబంధిత అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పాక్‌లో తిష్టవేసిన ఉగ్రవాదులపై తీసుకునే చర్యను నిర్థారించడం జరుగుతుందని హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు.