జాతీయ వార్తలు

భారత్‌కు అండగా నిలుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: జమ్మూ, కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో భారత సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతు ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా జపాన్, జర్మనీ దేశాలు ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. సార్క్ దేశాలయిన శ్రీలంక, భూటాన్ సైతం ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిరంతర సహకారం అవసరమని పిలుపునిచ్చాయి. తమ భూభాగంనుంచి వ్యాప్తి చెందుతున్న ఉగ్రవాదాన్ని అంతమొందించే బాధ్యత ప్రతి దేశంపైనా ఉందని పాక్ పేరును ప్రస్తావించకుండా జర్మనీ విదేశాంగ మంత్రి ప్రాంక్-వాల్టర్ స్టీన్‌మీయెర్ అన్నారు. ‘ఉగ్రవాదంపై పోరులో జర్మనీ భారత్ పక్షాన గట్టిగా నిలుస్తుంది. మరికొన్ని రోజుల్లో జరగబోయే భారత్-జర్మనీ ఉగ్రవాద నిరోధక చర్చల్లో మా రెండు దేశాల సమాజానికి ఎదురవుతున్న ఉగ్రవాదం ముప్పుపై మరింత లోతుగా చర్చిస్తాం’ అని ఆయన అన్నారు. హింసను రెచ్చగొట్టడమే ఉగ్రవాదుల ఉద్దేశమని, భారత్-పాక్ వివాదాలుసహా అన్ని విషయాల్లో ఈ లాజిక్‌కు మనం అవకాశమివ్వకూడదు’ అని ఆయన అన్నారు. కాగా, ఉద్దేశం ఏదయినప్పటికీ అన్ని రకాల ఉగ్రవాదాలు సమర్థనీయం కాదని జపాన్ ఒక ప్రకటనలో అంటూ, ఏ ఉగ్రవాద చర్య కూడా సమర్థనీయం కాదని పేర్కొంది. ఉగ్రవాదంపై పోరులో జపాన్ భారత్‌కు తన సంఘీభావాన్ని తెలియజేస్తోందని జపాన్ విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. ఉరీ ఉగ్రదాడిని శ్రీలంక తీవ్రంగా ఖండిస్తూ, ఉగ్రవాదం బెడదను అంతమొందించడానికి ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిరంతర సహకారం అవసరమని అభిప్రాయపడింది. తమ దేశం మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదానికి బలయిందని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఉగ్రవాదంపై పోరులో తమ దేశం భారత్‌కు అండగా నిలుస్తుందని భూటాన్ పేర్కొంది.