జాతీయ వార్తలు

జాబిల్లికి చేరువలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఆగస్టు 14: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్ మరో మైలురాయిని అధిగమించింది. చంద్రయాన్-2 తన అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసుకొని భూ కక్ష్యను వీడి జాబిల్లి కక్ష్య దిశగా ప్రయాణం ప్రారంభించి చంద్రుడికి చేరువవుతోంది. భూమి చుట్టూ తిరిగే కక్ష్యలో ఉన్న చంద్రయాన్-2 భూ కక్ష్యను వీడి చంద్రపథం వైపువెళ్లినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటిచింది. బుధవారం తెల్లవారు జామున 2:21గంటలకు 1,203సెకండ్లు పాటు మ్యాడూల్‌లో ఉన్న ద్రవ ఇంధనాన్ని మండించిన శాస్తవ్రేత్తలు కక్ష్యను పెంచి భూకక్ష్యలో ఉన్న చంద్రయాన్-2ను చంద్రపథం వైపు విజయవంతంగా మళ్లించారు. ప్రస్తుతం ఇది జాబిల్లి కక్ష్యకు చేరే ట్రాన్స్ ల్యూనార్ మార్గంలో పయనిస్తోంది. చంద్రయాన్-2 ప్రయోగ తర్వాత ఇప్పటి వరకు ఐదుసార్లు కక్ష్యను పెంచే ప్రక్రియను శాస్త్రవేత్తలు
విజయవంతంగా చేపట్టారు. భూ కక్ష్య నుంచి చంద్రపథం వైపు పయనం ప్రారంభించినప్పటి నుంచి చంద్రయాన్-2 3లక్షల 84వేల కిలో మీటర్లు ప్రయాణించినంతరం ఈ నెల 20న చంద్ర బదిలీ కక్ష్యకు చేరుకుంటుంది. ఇందుకోసం మరోసారి ద్రవ ఇంజిన్‌ను మండించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు చంద్రయాన్-2 ఎలాంటి అవరోధం లేకుండా విజయవంతంగా ముందుకు దూసుకెళ్తోందని ఇస్రో శాస్తవ్రేత్తలు సీనియర్ శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. మాడ్యూల్ పనితీరు కూడా మెరుగ్గా ఉందన్నారు. బెంగుళూరు ఇస్రో మిషన్ అఫరేషన్స్ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతూనే ఉంది. చంద్రుని ఉపరితలం నుంచి చంద్రయాన్-2 వ్యోమగామను 100కిలో మీటర్ల ఎత్తుకు తీసుకొచ్చేందుకు మరోసారి నాలుగుసార్లు కక్ష్యను మార్పుచేయనున్నారు. ఈ కక్ష్య మార్పు ప్రక్రియ విజయవంతంగా నిర్వహించినతరం సెప్టెంబర్ 2వ తేదీన చంద్రయాన్-2 100కిలో మీటర్ల ఎత్తుకు తీసుకురాన్నారు. అదేరోజు అర్బిటర్ మాడ్యూల్ నుంచి విడిపోయేలా అనంతరం రెండుసార్లు కక్ష్యను మార్పు నిర్వహించనున్నారు. అనంతరం భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యయాన్ని లిఖిస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 చంద్రుని దక్షిణ ధ్రువంపై సెప్టెంబరు 7వ తేదీన అర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుని ఉపరితలంపై దిగనుంది. జాబిలి ఉపరితలంపై ల్యాండర్ దిగిన వెంటనే అందులో ఉన్న ప్రగ్యాన్ రోవర్ వెలుపలకు వచ్చి 500మీటర్ల పరిధిలో సంచరిస్తూ చంద్రుడిపై పరిశోధనలు చేసి సమాచారాన్ని భూమి మీదకు అందించనుంది.