జాతీయ వార్తలు

నేడు 32మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి మెడల్స్ బహూకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో గురువారం వివిధ కేటగిరీలకు చెందిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి పోలీస్ సర్వీస్ పతకాలను బహూకరించనున్నారు. దేశ సేవలో అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ఈ పురస్కారాలను అందజేస్తారు. వీరిలో కమాండెంట్ సత్యబీర్ సింగ్, డిప్యూటీ కమాండెంట్ ఆర్ పైకానన్నన్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్ రవీంద్రన్ తదితరులున్నారు.
అలాగే, అత్యున్నత సేవలందించిన సీనియర్ కమాండెంట్స్ అజయ్ కుమార్, అనీల్ దామోర్, డిప్యూటీ కమాండెంట్ వైఎస్ షెకావత్ తదితరులు కూడా మెడల్స్ అందుకోనున్నారు. డీఐజీ రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిపి ముగ్గురికి రాష్టప్రతి పురస్కారానికి (ఫైర్ సర్వీస్ మెడల్స్) ఎంపికైనట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలియజేశారు. అగ్నిమాపక శాఖలో అత్యున్నత సేవలందించిన మరో ముగ్గురు సైతం మెడల్స్ అందుకోనున్నారు.