జాతీయ వార్తలు

రైళ్లకు కమాండోల భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: అత్యంత సమస్యాత్మమైన ప్రాంతాల్లో తిరిగే రైళ్లకు ప్రత్యేక కమాండో బృందాలతో భద్రత కల్పించనున్నారు. కమాండోస్ ఫర్ రైల్వే సేఫ్టీ (సీఓఆర్‌ఏఎస్) భద్రతను రైల్వే మంత్రి పియూష్ గోయల్ బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ప్రత్యేక భద్రతను కల్పించడం ఇదే మొదటిసారి అని అన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ భద్రతా ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. హర్యానాలోని జగధారిలో ఇందుకోసం ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. జమ్మూ-కాశ్మీర్‌ను కూడా ఈ సీఓఆర్‌ఏఎస్ పరిధిలోకి తెచ్చినట్టు ఆయన చెప్పారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సెస్ (ఆర్‌పీఎస్‌ఎఫ్)తో కలసి సీఓఆర్‌ఏఎస్ పనిచేస్తుందని గోయల్ వివరించారు.
ఈ కమాండోలకు అత్యాధునిక ఆయుధాలు అందిస్తామని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వారికి అందుబాటులో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.