జాతీయ వార్తలు

భారీ త్రివర్ణ పతాకంతో బీజేపీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, ఆగస్టు 14: జమ్మూ-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు బుధవారం పాట్నా నగర వీధుల్లో భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. 370 అడుగుల పొడవు గల ఈ జెండాతో గాంధీ మైదానం నుంచి కార్గిల్ చౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. కేంద్ర మాజీ మంత్రి సీపీ ఠాకూర్, మాజీ ఎంపీ రాంకృపాల్ యాదవ్, బీహార్ మంత్రి మంగళ్ పాండే, ఎమ్మెల్యే నితిన్ నవీన్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై అనే నినాదం పాట్నా వీధుల్లో మార్మోగింది. ఈ సందర్భంగా రాంకృపాల్ యాదవ్ మాట్లాడుతూ జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి ఇప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దును సాహసోపేత చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ చర్యతో జమ్మూ-కాశ్మీర్ అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకువెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.