జాతీయ వార్తలు

ఎర్రకోట నుంచి నేడు మోదీ ప్రసంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వరసగా ఆరోసారి ప్రసంగించనున్నారు. గురువారం మోదీ ప్రసంగంలో అనేక కీలక అంశాలు చోటు చేసుకోనున్నాయి. జమ్మూకాశ్మీర్ దగ్గర నుంచి దేశ ఆర్థిక పరిస్థితి వరకూ ప్రాధాన్యత గలవాటి గురించి మోదీ ప్రస్తావించే అవకాశాలున్నాయి. జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని ఎత్తివేస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ఆయనీ సందర్భంగా జాతికి తెలియజేస్తారు. దానికి ఎర్రకోట వేదిక కానుంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయంతో అత్యధిక స్థానాలు సాధించిన రెండోసారి అధికారంలో వచ్చిన మోదీ ప్రభుత్వం తొలిసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వం సాధించిన అంశాలు, లక్ష్యాలను వెల్లడించనున్నారు. స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్, చంద్రయాన్ ప్రయోగం ప్రధాని ప్రసంగంలో చోటుచేసుకోనున్నాయి. తమ ప్రభుత్వ హయాంలో దేశం సాధించిన అనేక అంశాలను ఆయనీ సందర్భంగా జాతికి వివరించే అవకాశం ఉంది. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని దేశం హర్షిస్తోందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తరువాత జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగాన్ని వారీ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి, కాశ్మీర్ లోయలో శాంతియుత పరిస్థితులు కల్పనకు మోదీ తన ప్రసంగంలో భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ చేసే ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ యేతర ప్రధానుల విషయానికి వస్తే గతంలోనూ ఎర్రకోట నుంచి వాజపేయి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేశారు. ఆయనా ఆరుసార్లు అంటే 1998-2003 మధ్య జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 2014లో మిత్రపక్షాలను కలుపుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇటీవల ఎన్నికల్లో 307 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో అనేక సామాజిక, ఆర్థిక అంశాల గురించి ప్రస్తావించే అవకాశం ఉంది.

చిత్రం...న్యూఢిల్లీని ఎర్రకోట వద్ద గురువారం భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భద్రతా సిబ్బంది
బందోబస్తు నిర్వహించినప్పటి దృశ్యం