జాతీయ వార్తలు

రాహుల్ కిసాన్‌యాత్రకు ఏపిసిసి సంఘీభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి ఎఐసిసినుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన కిసాన్‌యాత్రకు ఏపి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం సంఘీభావం తెలిపింది. గురువారం ఉదయం కాన్పూర్‌లో రాహుల్‌గాంధీని ఏపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అధ్వర్యంలో ప్రతినిధుల బృందం కలిసింది. ఈ సందర్భంగా గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఏస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు సంబంధించిన అంశాలను ఆయన రాహుల్‌కు వివరించారు. రాహుల్ గాంధీ ఆసక్తిగా ఆ పాదయాత్రకు సంబంధించిన అంశాలను, విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఈ నెల 28న తిరుపతిలో ఏపిసిసి అధ్వర్యంలో జరిగే ప్రజాబ్యాలెట్ గురించి... ఇందులో రెండు అంశాలు ముఖ్యంగా ప్రత్యేక హోదా కావాలా, వద్దా అన్న అంశం, 2014 ఎన్నికల హామీలు నెరవేర్చిందా? అన్న అంశం గురించి రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కాంగ్రెస్ బృందంలో రఘువీరారెడ్డితో పాటుగా కెవిపి రామచంద్ర రావు, గిడుగు రుద్రరాజు తదితరులు ఉన్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రకటనను రఘువీరారెడ్డి విడుదల చేశారు.