జాతీయ వార్తలు

ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్)లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎమర్జెన్సీ వార్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. ప్రమాదం సంభవించిన స్థలానికి 34కు పైగా ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నాలు చేశాయి. భవనం మొత్తం పొగ ఆవరించడంతో ఎమర్జెన్సీ ల్యాబ్‌ను మూసివేశారు. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎయిమ్స్‌లోని మరొక భవనంలో గల కార్డియో న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. షార్ట్ సర్క్సూట్ కారణంగానే ఆస్పత్రిలో మంటలు వ్యాప్తించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. భారీస్థాయిలో మంటలు చెలరేగడంతో ఆ భవనంలో ఉన్న రోగులను మరోచోటుకు ఆఘమేఘాల మీద తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని, సహాయక చర్యలకు సహకరించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.