జాతీయ వార్తలు

సామరస్యపూర్వక చర్చ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: రిజర్వేషన్ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య సామరస్యపూర్వక చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నారు.
గతంలో తాను రిజర్వేషన్ల గురించి మాట్లాడినప్పుడు పెద్ద గొడవే జరిగిందని, దాని ఫలితంగా చర్చ గాడి తప్పిందని ఆదివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. అలాగే రిజర్వేషన్ల వ్యతిరేక వర్గాలు కూడా తమకు అనుకూలమైన పరిస్థితులను కల్పించుకునే ప్రయ త్నం చేస్తాయని భగవత్ తెలిపారు. ఎప్పుడు రిజర్వేషన్లపై చర్చ జరిగినా అనుకూల, ప్రతికూల వాదనలు తీవ్ర స్థాయిలోనే సాగుతాయని పేర్కొన్న ఆయన సమాజంలోని భిన్నవర్గాల మధ్య సామరస్యాన్ని సాధించడం వల్లే దీన్ని అధిగమించవచ్చని తెలిపారు. జ్ఞాన ఉత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన మోదీ ప్రభుత్వంపై సంఘ్ ప్రభావం ఉందంటూ వచ్చిన విమర్శలను ప్రస్తావించారు. అన్ని విషయాల్లోనూ మోదీ సర్కారు తమతో ఏకీభవించాల్సిన అవసరం లేదన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా జాతీయ ప్రాధాన్యతలే దానికి ముఖ్యం అవుతాయని ఆయన తెలిపారు.