జాతీయ వార్తలు

జైట్లీ ఆరోగ్య స్థితిపై ఢిల్లీ సీఎం వాకబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఆదివారం కూడా అనేక మంది ప్రముఖులు ఇక్కడి ఎయిమ్స్‌ను సందర్శించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాంవిలాస్ పాశ్వాన్ తదితరులు ఎయిమ్స్‌ను సందర్శించి జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వైద్యులు జైట్లీకి కృత్రిమంగా శ్వాసను అందిస్తున్నారు. ఊపిరాడకపోవడం, ఆయాసంతో బాధపడుతున్న 66 ఏళ్ల జైట్లీని ఆగస్టు తొమ్మిదో తేదీన ఇక్కడి అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్)లో చేర్పించారు. అయితే ఎయిమ్స్ ఆగస్టు 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి బులెటిన్‌ను విడుదల చేయలేదు. అనేక మంది ప్రముఖ నాయకులు జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఇటీవలి రోజుల్లో ఎయిమ్స్‌ను సందర్శిస్తున్నారు. వివిధ విభాగాల వైద్య నిపుణులతో కూడిన బృందం జైట్లీ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయడానికి ఆదివారం ఎయిమ్స్‌ను సందర్శించిన వారిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణగోపాల్, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్ సింగ్ ఉన్నారు. శనివారం కూడా అనేక మంది రాజకీయ నాయకులు ఎయిమ్స్‌ను సందర్శించి జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఎయిమ్స్ వైద్యులు జైట్లీకి తాము చేయగలిగినంత ఉత్తమ చికిత్సను చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం చెప్పారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి శుక్రవారం ఎయిమ్స్‌ను సందర్శించారు.