జాతీయ వార్తలు

ఇది ఆర్థిక అత్యవసర పరిస్థితే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశంలో ఆర్థిక అత్యవసర (ఎమర్జెన్సీ) పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చాలా చక్యంగా తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. ఆర్థిక పరిస్థితి మందగించిందని, ఈ పరిస్థితులు ఆర్థిక ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఆటో మొబైల్ రంగం కూడా మందగించిందని, రవాణా వాహనాలు 31 శాతం తగ్గాయని అన్నారు. గత ఏడాది జూలై నుంచి అంటే సుమారు 12, 13 నెలలుగా విక్రయాలు తగ్గాయని ఆయన తెలిపారు. వాహనాల విక్రయ రంగంలో మన దేశం ఇప్పటి వరకు ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో ఉండేదని ఆయన గుర్తు చేశారు. స్టాక్ ఎక్చేంజ్ కుప్పకూలిందని, ద్రవ్యలోటు పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఇతర విషయాలకు వస్తే జీడిపి తిరోగమనంలో ఉందని, కార్మిక శక్తి తగ్గిపోతున్నదని, రియల్ ఎస్టేట్ రంగంలోనూ మాంద్యం ఏర్పడిందని, రూపాయి విలువ క్రమేణా పతనమవుతూనే ఉన్నదని, విదేశీ ప్రత్యక్ష, పరోక్ష పెట్టుబడులూ తగ్గిపోయాయని ఆయన విమర్శించారు. నిరుద్యోగ సమస్యను రూపుమాపలేదని, ద్రవ్యోల్భణంలో మార్పులేదని ఆయన అన్నారు. బీజేపి ప్రచార ఆర్భాటమే తప్ప ప్రగతి సాధించలేదని సింఘ్వి విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రధానిగా మొదటి సారి బాధ్యతలు చేపట్టినప్పుడు గానీ, రెండో సారి ప్రధానిగా అయిన తర్వాతగానీ ఎటువంటి అభివృద్ధి సాధించలేదని, అంతా తిరోగమనమేనని సింఘ్వి ధ్వజమెత్తారు.