జాతీయ వార్తలు

హిమాచల్‌లో వరద బీభత్సం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, ఆగస్టు 18: హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను వర్షాలు, వరదలు కుదిపేస్తున్నాయి. కొండచరియలు విరిగి పడుతున్నాయి.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా ఆదివారం వరదలు కారణంగా రాష్టవ్య్రాప్తంగా కనీసం 18మంది మరణించగారు. తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
అధికార వర్గాల సమాచారం మేరకు.. సిమ్లాలో ఎనిమిది మంది మరణించగా.. కులు, సిర్మార్, సోలన్, చంబ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతిచెందారు. ఉనా, లాహౌల్-స్పితి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు. సిమ్లా ఆర్టీసీ కార్యాలయం సమీపంలో కొండ చరియలు విరిగి పడడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. సిమ్లా జిల్లాలోని నార్కండ్ ప్రాంతంలో భారీ వృక్షం ఇంటిపై కూలిన దుర్ఘటనలో ఇద్దరు నేపాలీలు మరణించగా ముగ్గురికి గాయాలయ్యాయి. తెల్లవారు ఝామున గోడ కూలిన దుర్ఘటనలో ఓ కార్మికుడు మరణించాడు.
ఇతన్ని బిహార్‌కు చెందిన రిషా అలంగా గుర్తించారు. హత్కొలి కెంచిలో హైవేపై వెళ్తున్న ట్రక్కుపై కొండచరియలు విరిగి పడడంతో ఒకరు మరణించారు. చంబ జిల్లాలో ఇల్లు కూలిన దుర్ఘటనలో ఇద్దరు మరణించినట్లు జిల్లా ఎస్పీ మోనిక భుటుంగూరు చెప్పారు. కులూలోని సుజ్వద్ నుల్లాలో వరద ప్రవాహానికి ఒకరు కొట్టుకుపోయారు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బలర్గాలో కొండల చరియలు విరిగిపడడంతో పర్యాటకుడొకరు దుర్మరం చెందారు.
సోలన్ జిల్లాలో భవనం కుప్పకూలిన దుర్ఘటనలో మరో ఇద్దరు దుర్మరం చెందినట్లు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ రిచా వర్మ చెప్పారు.
ఉప్పొంగుతున్న యమునా
న్యూఢిల్లీ: యమునా నదిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యమునా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఈ పరిస్థితుల్లో హర్యానాలోని హతినికుండ్ బ్యారేజీ నుంచి 4.30 లక్షలకుపైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో హర్యానా యమునా నగర్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు. దీంతో ఢిల్లీ యమునా నదీ పరీవాహక ప్రాంతాలలో ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. దేశ రాజధానిలో కూడా శనివారం రోజంతా అడపా దడపా తేలికపాటి వర్షపాతం నమోదు అవుతూ.. ఆదివారం కూడ కొనసాగింది. అయితే యమునా నదికి వరద, నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని.. మరింత వరద పెరిగితే ఎలా వ్యవహరించాలి.. నది ఒడ్డున, ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరిలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడే ఢిల్లీ వాసులకు గాలి నాణ్యత పెరగడంతో ఒకింత ఊపిరి పీలుకుంటున్నారు. శనివారం ఢిల్లీలో కురిసిన వర్షం కారణంగా గాలి నాణ్యత మంచి పరిస్థితికి చేరుకుందని అధికారులు తెలిపారు.