జాతీయ వార్తలు

ఆధార్ నంబర్లను అడిగే అధికారమివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: కొత్తగా ఓటర్లుగా నమోదయ్యే వారితో పాటు ఇప్పటికే ఓటర్ల జాబితాలో ఉన్న వారి నుంచి వారి ఆధార్ నంబర్లను సేకరించడానికి తనకు చట్టబద్ధమయిన అధికారాన్ని ఇవ్వవలసిందిగా ఎన్నికల సంఘం (ఈసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తి పేరు పలుచోట్ల ఉండటాన్ని నివారించడానికి ఈ చర్య అవసరమని ఈసీ వివరించింది. ఓటర్ల ఆధార్ నంబర్లను సేకరించే అధికారాన్ని తనకు కల్పిస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను సవరించాలని ఎన్నికల సంఘం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు రాసిన ఒక లేఖలో కోరింది. ఈ నెల మొదట్లో రాసిన ఈ లేఖలో ఈసీ చేసిన ప్రతిపాదన ప్రకారం, ఇప్పటికే ఉన్న ఓటర్లతో పాటు కొత్తగా ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలనుకునే వారి నుంచి వారి ఆధార్ నంబర్లను అడిగే అధికారం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి సంక్రమిస్తుంది.