జాతీయ వార్తలు

...కెప్టెనే ముందు దూకేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఆగస్టు 19: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడాన్ని మునిగిపోతున్న నౌకను దాని కెప్టెన్ వదిలివేయడంగా బీజేపీ సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ అభివర్ణించారు. అధ్యక్ష పదవి బాధ్యతను సోనియా గాంధీకి అప్పగించడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. పదవుల మార్పిడిపై మాట్లాడిన ఆయన ‘ఇది అహ్మద్ టోపిని మహ్మద్‌కు...మహ్మద్ టోపిని అహ్మద్‌కు’ మార్చినట్లుగా ఉందన్నారు. రాహుల్ గాంధీ రాజీనామాకు బదులుగా పాలనలో విఫలమైనందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు రాజీనామా చేసి ఉండాల్సిందని చౌహన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు పంట రుణాలను మాఫీ చేయడంలోనూ, నిరుద్యోగ భృతి కల్పించడంలోనూ విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. ఏ పడవ అయినా మునిగిపోతున్నప్పుడు దానిని రక్షించేందుకు కెప్టెన్ చివరి వరకూ ప్రయత్నిస్తారని కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందుగానే దూకేశారని చౌహన్ అన్నారు. ఇప్పుడు మళ్లీ అధ్యక్ష బాధ్యత ఆయన తల్లి సోనియా గాంధీకే దక్కిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే పంట రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అది చేయలేకపోయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రులను రాహుల్ గాంధీ ఎందుకు తొలగించలేదని చౌహన్ ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రులను తొలగించలేదు కానీ రాహుల్ గాంధీ మాత్రం తప్పుకున్నారని అన్నారు.