జాతీయ వార్తలు

రాజ్యసభకు మన్మోహన్ ఎన్నిక ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఆగస్టు 19: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు మదన్ లాల్ సైనీ మృతితో ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆ స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మన్మోహన్ సింగ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. ఖాళీగా ఉన్న ఒక్క స్థానానికి ఒక్క నామినేషనే దాఖలు కావడంతో మాజీ ప్రధాని ఏకగ్రీవమైనట్లు రాజస్థాన్ అసెంబ్లీ కార్యదర్శి, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ ప్రమీల్ కుమార్ మాథుర్ ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన మన్మోహన్ సింగ్‌ను పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం తమ రాష్ట్రానికే గర్వకారణమని ముఖ్యమంత్రి గెహ్లాట్ ట్వీట్ చేశారు. వరుసగా నాలుగు పర్యాయాలు అంటే 1991 నుంచి 2019 వరకు ఆయన అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది జూన్ 14న సింగ్ పదవీ కాలం ముగిసినా, ఇదే సంవత్సరం మళ్లీ ఆగస్టులో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 సంవత్సరం వరకు దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు మొత్తం 10 సీట్లు ఉన్నాయి. ఇందులో 9 సీట్లు బీజేపీ ఇదివరకే కైవసం చేసుకుంది.