జాతీయ వార్తలు

చిదంబరానికి ఈడీ సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం సమన్లు జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాలో ఆర్థికపరమైన అవకతవకలకు సంబంధించి ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను గట్టెంచేందుకు యూపీఏ హయాంలో పలు చర్యలు భారీ కుంభకోణానికి దారితీసింది. ప్రైవేటు సంస్థలైన పలు విమానయాన సంస్థలకు ఎయిర్ స్లాట్స్ కేటాయింపులో అవకతవకలు జరిగాయని తేలింది. ఎయిర్ ఇండియాకు భారీ నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థ గుర్తించింది. అప్పట్లో కేంద్ర పౌర విమానయాన మంత్రిగా పనిచేసిన ప్రఫుల్‌పటేల్‌ను ఇప్పటికే
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. అప్పటి ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి సోమవారం ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 23న ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు వచ్చి దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు.
మరోపక్క ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో చిదంబరం ముందస్తు బెయిల్‌పై మంగళవారం కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది. సీబీఐ,ఈడీ వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. విచారణకు చిదంబరం సహకరించడం లేదని ఈడీ ఆరోపిస్తోంది. న్యాయమూర్తి సునీల్ గౌర్ మంగళవారం తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థ విదేశీ నిధులు సమీకరించుకునేందుకు ఆర్థిక మంత్రిగా చిదంబరం అనుమతి ఇచ్చారని అభియోగం. దీనికి ప్రతిఫలంగా చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఖాతాలోకి నగదు బదిలీ చేసినట్టు వెల్లడైంది ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణంలో 2017 మే 15న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.