జాతీయ వార్తలు

విమానంలో పేలిన శామ్‌సంగ్ నోట్ ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: సిగంపూర్‌నుంచి చెన్నై వస్తున్న విమానంలో శుక్రవారం శామ్‌సన్ గెలాక్సీ నోట్-2 పేలిపోయింది. ఈ రోజు ఉదయం 7.45 గంటల సమయంలో చెన్నై విమానాశ్రయంలో విమానం లాండయ్యే సమయంలో ఈ ఫోన్ పేలినట్లు తెలుస్తోంది. ఫలితంగా విమానంలో స్వల్పంగా మంటలు చెలరేగగా, సిబ్బంది మంటలార్పే యంత్రాలతో ఆ మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదం జరిగింది ఏ విమానయాన సంస్థకు చెందిన విమానంలోనో వెంటనే తెలియరాలేదు. దీంతో విమానాల్లో ప్రయాణించేటప్పుడు తమ శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఫోన్లను స్విచాఫ్ చేయాల్సిందిగా తమ ప్రయాణికులకు సూచించాల్సిందిగా పౌరవిమానయాన రెగ్యులేటర్ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ)విమానయాన సంస్థలను ఆదేశించింది.