జాతీయ వార్తలు

జాబిల్లికి మరింత చేరువగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దాదాపు 30 నిమిషాల పాటు మా గుండెలు దాదాపుగా ఆగిపోయినంతగా ఉత్కంఠ ఏర్పడింది. ఉమ్మడి కృషి
ఫలితంగా చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ వ్యోమ నౌకను విజయవంతంగా
ప్రవేశపెట్టగలిగాం. ఇప్పుడు దీనికి మించిన టెన్షన్ ఇంకా ఉంది. ఎందుకంటే వచ్చే నెల 7న సజావుగా చంద్రయాన్-2ను చంద్రుడి ఉపరితలంపైకి దింపడం ఎలా అన్నది మమ్మల్ని ఇప్పటి నుంచే ఉత్కంఠకు
గురి చేస్తోంది’
- ఇస్రో చైర్మన్ శివన్
**
సూళ్లూరుపేట, ఆగస్టు 20: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 మంగళవారం అత్యంత కీలక ఘట్టాన్ని పూర్తిచేసింది. 29 రోజుల నిరీక్షణకు తెరదించుతూ ఉదయం 9 గంటలకు చంద్రయాన్-2 వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. దీని కోసం చేపట్టిన 30 నిమిషాల ప్రయోగంలో ఉపగ్రహంలో ఇంధనాన్ని మండించే సమయంలో శాస్తవ్రేత్తలంతా తీవ్ర ఉత్కంఠకు గురై విజయవంతంగా మాడ్యూల్‌ను కక్ష్యలోకి చేర్చడంతో అందరూ ఊపిరిపీల్చుకొన్నారు. చంద్రయాన్-2 విజయవంతంగా జాబిల్లి కక్ష్యలోకి చేరడంతో బెంగళూరులో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ విలేఖర్ల సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. జాబిల్లి కక్ష్యలోకి మాడ్యూల్‌ను చేర్చే సమయంలో ఆ అరగంట ఊపిరి బిగపట్టిన పరిస్థితి నెలకొందని శాస్తవ్రేత్తలు తీవ్ర ఉత్కంఠకు గురైనట్లు తెలిపారు. గడియారంలో ముల్లు తిరుగున్న కొద్దీ ఉపగ్రహ నియంత్రణ కేంద్ర భవనం మొత్తం ఉద్విగ్నత, ఆతృతతో నిండిపోయిందన్నారు. చంద్రయాన్-2 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించగానే ఒక్కసారిగా ఉపశమనం, ఉల్లాస వాతావరణం నెలకొంది అంటూ ఆపరేషన్ సమయంలో శాస్తవ్రేత్తల పరిస్థితిని కళ్లకు కట్టేలా వివరించారు. త్వరలోనే మనం మరోసారి చంద్రుడి కలుసుకోబోతున్నాం.. మన దేశ జెండా ఎగురుతుందని ఇస్రో చైర్మన్ విశ్వాస ధీమా వ్యక్తం చేశారు. సర్వత్రా ఆసక్తిరేపిన ఈ ఆపరేషన్ సందర్భంగా ఇస్రోలో దాదాపు 200మంది పైగా శాస్తవ్రేత్తలు సమావేశం అయ్యారు. చంద్రయాన్-2 విజయవంతంగా కక్ష్యలోకి చేరుకోగానే సంతోషంతో ఒకరినొకరు సంతోషాన్ని పంచుకొన్నారు. చంద్రయాన్-2 గమనం పై మరో 24గంటలు పర్యవేక్షణ ఉంటుందని ఇస్రో సీనియర్ శాస్తవ్రేత్త ఒకరు తెలిపారు. ప్రయోగం అనుకొన్నట్లు సాగితే సెప్టెంబరు 7తేదీ నాటికి చంద్రయాన్-2 చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగనుంది. చంద్రుని వద్దకు
చేరడం ఉత్కంఠభరిత సన్నివేశమని ఆయన పేర్కొన్నారు. ఇస్రో చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగంగా చంద్రయాన్-2 వినుతికెక్కిన క్రమంలో సెప్టెంబరు 7న చంద్రయాన్-2 ప్రయోగం పై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇదే జరిగితే చంద్రుడి పై అంతరిక్ష నౌకను దించిన అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారత్ చేరుతోంది. కాగా చంద్రయాన్-1 పేరుతో 2008లో చంధ్రుడి పైకి ఇస్రో తొలిసారి ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే. మళ్లీ 11సంత్సరాల తరువాత చంద్రయాన్-2 పేరుతో ఇస్రో మళ్లీ చంద్రుడి పైకి ఉపగ్రహాన్ని విజయవంతంగా పంపడంతో ప్రపంచ దేశాల్లో నాలుగో దేశంగా అవతరించింది. చంద్రయాన్-2 ప్రాజెక్టులో ఈ రోజు అత్యంత కీలక ఘట్టాన్ని పూర్తిచేసి దేశ ప్రజలు మరువలేని రోజుగా పలువురు శాస్తవ్రేత్తలు అభివర్ణించారు. ఈ సందర్భంగా చైర్మన్ శివన్ ప్రయోగ వివరాలను వివరించారు. ఇక నుంచి జరగబోయే అన్ని ప్రక్రియలు సాంకేతిక అంశాలతో సహా వివరించారు, ఈ రోజు చంద్రయాన్-2లో కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తిచేశాం. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సిన విన్యాసం ఉదయం 9గంటలకు ప్రారంభమై 30నిమిషాల పాటు సాగిందన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం పైకి చేరాలంటే ఓ కచ్చితమైన కక్ష్యలోకి వ్యోమనౌకను చేర్చాల్సి ఉంటుందన్నారు. దానికి ఉపగ్రహాన్ని 90డిగ్రీలు మళ్లించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం 88డిగ్రీలు ఇంక్లినేషన్‌తో చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ తిరుగుతుందన్నారు. ఈ క్రమంలో మరోసారి కక్ష్యను మార్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అప్పుడు 90డిగ్రీల ఇంక్లినేషన్‌కు చేరుకొంటుంది. జూలై 22న ప్రయోగించిన తరువాత ఇప్పటి వరకు మొత్తం 5సార్లు విన్యాసాలు చేపట్టామన్నారు. అందులో ఆగస్టు 14న చేపట్టిన ట్రాన్స్ లూనార్ ప్రక్రియ అత్యంత కీలకమైంది. ఇప్పటి వరకు చంద్రయాన్-2లోని వ్యవస్థలన్నింటి పనితీరు సజావుగా సాగుతోందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-2 జాబిల్లి ఉపరితలానికి చేరుకొనే క్రమంలో చేసే ప్రయోగాలను సాంకేతిక అంశాలతో సహా వివరించారు. మరో నాలుగు సార్లు విన్యాసాల ద్వారా చంద్రయాన్-2 కక్ష్యలను తగ్గిస్తూ వస్తామన్నారు. సెప్టెంబరు 2న అర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోతోంది. ల్యాండర్‌లో వ్యవస్థలన్నింటిని సిద్ధం చేసేలా సెస్టెంబరు 3న మూడు సెకన్ల పాటు మర విన్యాసం చేస్తామన్నారు. సెప్టెంబర్ 4న మరో 6సెకన్ల పాటు ల్యాండర్ పై మరో విన్యాసం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మూడు రోజుల పాటు వ్యవస్థలన్నింటిని నిశితంగా పరిశీలించి అన్ని సజావుగా సాగేలా చూస్తామన్నారు. అన్ని సజావుగా సాగినంతరం సెప్టెంబరు 7న వేకుజామున 1:40గంటలకు ల్యాండర్‌లో ప్రొపల్షన్ ప్రారంభమై 1:55గంటలకు దిగుతోంది. అనంతరం రెండు గంటల తరువాత ల్యాండర్‌లోని రోవర్ (ల్యాంప్) చంద్రుడి ఉపరితలాన్ని తాకుతోంది. సరిగ్గా 3:10గంటలకు ఉపగ్రహంలో ఉండే సోలార్ ఫ్యానళ్లు తెరుచుకొంటాయి. 4గంటల ప్రాంతంలో రోవర్ జాబిల్లి ఉపరితలానికి చేరుకొని ఆఫరేషన్‌ను ప్రారంభిస్తుందని స్పష్టం చేశారు. ఆపై జాబిల్లి గుట్టమట్లను ఆవిష్కరించడంతో పాటు అక్కడి వాతావరణం పై పరిశోధన చేపడుతోంది.

చిత్రం... బెంగళూరులో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ కే.శివన్