జాతీయ వార్తలు

టీచర్ల సమస్యలు పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఆగస్టు 20: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పారా-టీచర్లు ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేస్తున్న ఆందోళనను ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పరిష్కరించాలని ఫిల్మ్‌మేకర్ అపర్ణా సేన్ సహా రాష్ట్రానికి చెందిన పది మంది ప్రముఖులు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరారు. ‘సిటిజెన్ స్పీక్ ఇండియా’ పేరిట వారు ఈ మేరకు సీఎంకు ఒక బహిరంగ లేఖ రాశారు. తమ వేతనాలు పెంచాలని కోరుతూ నాడియా జిల్లాలోని కల్యాణిలో నిరాహార దీక్ష చేస్తున్న పారా-టీచర్లపై ఆగస్టు 17వ తేదీన పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని, వారిని అరెస్టు చేయడాన్ని ఈ లేఖలో ప్రస్తావించారు. వారు ఈ లేఖను సోమవారం ముఖ్యమంత్రికి పంపించారు. దేశవ్యాప్తంగా మూక హత్యలు పెరుగుతుండటం పట్ల తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జూలై 24వ తేదీన ఒక బహిరంగ లేఖ రాసిన 49 మందిలోనూ అపర్ణాసేన్, నటులు ఉన్నారు. అయితే, పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు మాత్రం వారు వౌనంగా ఉంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా మమతా బెనర్జీకి రాసిన బహిరంగ లేఖపై సంతకం చేసిన వారిలో అపర్ణాసేన్‌తో పాటు నటులు పరంబ్రత చటర్జీ, కౌశిక్ సేన్, అతని కుమారుడు, ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన అతి పిన్న వయస్కుడయిన రిథి సేన్ ఉన్నారు.