జాతీయ వార్తలు

రిజర్వేషన్లపై చర్చ అనవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: రిజర్వేషన్లపై ఎలాంటి చర్చ అవసరం లేదని జనశక్తి పార్టీ అధినేత, బీజేపీ మద్దతుదారు, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. రిజర్వేషన్ల అంశం వెనుకబడిన వర్గాల కోసం రాజ్యాంగం కల్పించిన హక్కు అని మంగళవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను నేరుగా ప్రస్తావించకుండానే ‘ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు.. దీనిపై చర్చ అవసరం లేదు’అని పేర్కొన్నారు. ‘మోహన్ భగవత్ వ్యాఖ్యల గురించి నాకు తెలియదు.. ఈ అంశం రాజ్యాంగం కల్పించిన హక్కు.. ప్రస్తుతం అగ్ర వర్ణాల్లోని నిరుపేదలకు సైతం రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి.. అందువల్ల దీనిని స్వస్తి పలకడమనేది అసాధ్యం’ అని పాశ్వాన్ చెప్పారు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు చెప్పే అబద్దాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ఇంతవరకు రిజర్వేషన్లు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే వర్తించేవని.. ప్రధాని మోదీ ఆర్థికంగా వెనుకబడిన అగ్ర వర్ణాలకు సైతం వర్తించేలా చర్యలు చేపట్టారని పాశ్వాన్ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ కూడా రిజర్వేషన్లకు తమ మద్దతు ఉంటుందని వివరణ ఇచ్చిందని పాశ్వాన్ అన్నారు.